ఒకే బ్యాంకులో 38 మందికి కరోనా

తాజా వార్తలు

Published : 27/07/2020 01:28 IST

 ఒకే బ్యాంకులో 38 మందికి కరోనా

30 మంది ఉద్యోగులకు పాజిటివ్‌గా నిర్ధరణ

తిరుచిరాపల్లి: తమిళనాడు రాష్ట్రం తిరుచిరాపల్లిలోని ఓ కేంద్ర బ్యాంకు బ్రాంచిలో కరోనా కలకలం రేపింది. ఆ బ్రాంచిలో పనిచేస్తున్న దాదాపు 38 మందికి మహమ్మారి సోకినట్లు బ్యాంకు అధికారులతోపాటు స్థానిక అధికారులు వెల్లడించారు. బ్యాంకు ఉద్యోగులకు సామూహక పరీక్షలు నిర్వహించిన తరువాత ఈ విషయం బయటపడింది. ఈ నేపథ్యంలో బ్రాంచిని సందర్శించిన వినియోగదారులను కొవిడ్‌ పరీక్షలకు హాజరు కావాల్సిందిగా అధికారులు కోరుతున్నారు. బ్యాంకులో శానిటైజేషన్ ప్రక్రియ పూర్తయిందని, రేపటి నుంచి కార్యకలాపాలను తిరిగి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు బ్యాంకు సీనియర్ అధికారి తెలిపారు. కరోనాతో పోరాడుతూ గతంలో బ్రాంచికి చెందిన ఓ అధికారి మృతిచెందారు. కొవిడ్‌ కేసుల్లో తమిళనాడు దేశంలో రెండో స్థానంలో ఉంది. మహారాష్ట్ర తర్వాత అత్యధిక కేసులు తమిళనాడులోనే నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2.06 లక్షల మందికి మహమ్మారి సోకింది. 
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని