Oxygen sisters ఊపిరి నిలుపుతున్నారు..
close

తాజా వార్తలు

Updated : 10/05/2021 13:39 IST

Oxygen sisters ఊపిరి నిలుపుతున్నారు..

మహారాష్ట్రలోని నందూర్‌బార్‌ ఆసుపత్రిలో విజయగాథ

నందూర్‌బార్‌: పరిమితంగా ఉన్న వనరులతో గరిష్ఠ ప్రయోజనాలను పొందడంలోనే సామర్థ్యం బయటపడుతుంది. ఇలాంటి సందర్భాల్లోనే నూతన ఆలోచనలు వెలుగు చూస్తాయి. రాజధాని దిల్లీలో ప్రాణవాయువు లేక జనం అల్లాడుతుంటే ఎక్కడో మహారాష్ట్రలో మారుమూల గిరిజన జిల్లా అయిన నందూర్‌బార్‌లో ఎలాం టి చీకూచింతా లేకుండా ఉండడానికి కారణం ఇలాంటి నూతన ప్రయోగమే. అక్కడి జిల్లా ఆసుపత్రిలోని నర్సులకే ‘ఆక్సిజన్‌ సిస్టర్స్‌’ కొత్త బాధ్యతలు అప్పగించడంతో ప్రాణవాయువు సమస్యన్నదే కనిపించడం లేదు. 
ఆలోచనలు సాగాయిలా..:

స్వయంగా వైద్యుడైన జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ రాజేంద్ర భారుడ్, స్థానిక అధికారుల చొరవే ఈ ప్రయోగానికి కారణం. తగినంతగా ఆక్సిజన్‌ను నిల్వ చేయడంకన్నా..., ఉన్న దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలన్నదానిపై తొలుత ఆలోచనలు జరిపారు. అందులో భాగంగా ఆక్సిజన్‌ ఎలా వృథా అవుతోందో గుర్తించారు. రోగికి ప్రతిసారీ ఒకేస్థాయిలో ఆక్సిజన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని సార్లు తక్కువ మోతాదులో ఇస్తే సరిపోతుంది. అలాంటప్పుడు మీటను కొంచెం తిప్పితే తక్కువ మొత్తంలో ఆక్సిజన్‌ వెళ్లే అవకాశం ఉంది. ఆ విధంగా ఆక్సిజన్‌ను మిగుల్చుకోవచ్చు. రోగి భోజనం చేస్తున్నప్పుడో, మూత్రశాలకు వెళ్లినప్పుడో ఆక్సిజన్‌ సిలిండర్‌ను ఆపు చేయడం లేదు. ఇలా కూడా మరికొంత వృథా అవుతోంది. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలతోనే ఆక్సిజన్‌ను పొదుపు చేసి, అవసరమైన వారి కోసం వాడుకోవచ్చని అంచనా వేశారు.
20 పడకలకు ఒక నర్సు పర్యవేక్షణ: ఇలా ఆక్సిజన్‌ వృథా కాకుండా చూసే బాధ్యతలను కొందరు నర్సులకు అప్పగించారు. వారికి ‘ఆక్సిజన్‌ సిస్టర్స్‌’ అని పేరు పెట్టారు. 20 పడకలకు ఒక నర్సును కేటాయించారు. రోగికి ఎంత ఆక్సిజన్‌ అవసరమో అంతే సరఫరా అయ్యేలా చూడడం వారి విధి. వీరి పనితీరును జిల్లా ఆసుపత్రి వైద్యుడు డాక్టర్‌ రఘునాథ భోయే పర్యవేక్షిస్తుంటారు. నందుర్‌బార్‌ జిల్లా ఆసుపత్రిలో 240 పడకలు ఉండగా, అందుకు తగ్గట్టుగా ‘ఆక్సిజన్‌ సిస్టర్స్‌’ను నియమించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని