కరోనాపై అసత్య ప్రచారమా? ఫిర్యాదు చేయండిలా..!
close

తాజా వార్తలు

Published : 02/04/2020 14:44 IST

కరోనాపై అసత్య ప్రచారమా? ఫిర్యాదు చేయండిలా..!

కరోనా రోగిపై అసత్యప్రచారం, ముగ్గురి అరెస్టు

ఇంటర్నెట్‌ డెస్క్‌‌: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) సోకిన ఓ రోగి గురించి సోషల్‌ మీడియాలో వదంతులు ప్రచారం చేసినందుకు ఒక మహిళతో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఒడిశాలోని భద్రక్‌ పట్టణంలో చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌కు మాత్రమే కాకుండా కరోనాకు సంబంధించిన అబద్ధపు ప్రచారాన్ని నిరోధించటానికి ముందుకు రావాలని ప్రభుత్వ రంగ సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) నెటిజన్లకు విజ్ఞప్తి చేసింది. కొవిడ్-19ను గురించి అబద్ధపు సమాచారాన్ని సోషల్‌ మీడియాలో గమనిస్తే తమకు తెలియచేయాలని సంస్థ యూజర్లను కోరింది. ఇందుకుగానూ ఆ వార్త స్క్రీన్‌షాట్‌ లేదా లింక్‌ను 87997 11259 అనే వాట్సాప్‌ నంబరుకు లేదా pibfactcheck@gmail.com మెయిల్‌ ఐడీకి పంపించాలని పీఐబీ తెలిపింది. 

కరోనా వైరస్‌ మహమ్మారి ప్రపంచానికే ప్రమాదంగా మారిందని... ఈ నేపథ్యంలో తప్పుడు సమాచారానికి, అబద్ధపు వార్తలకు సోషల్‌ మీడియా వేదిక కారాదని ప్రభుత్వం ఇటీవల మార్గదర్శకాలు జారీచేసింది. కాగా ఈ విధమైన సమాచారాన్ని తమ ఫ్లాట్‌ఫాంల నుంచి తొలగించాలని, యథార్థ సమాచారాన్ని మాత్రమే అందుబాటులో ఉంచాలని సోషల్‌ మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేసింది. యూజర్లు ఈ విధమైన అబద్ధపు వార్తలను అప్‌లోడ్‌ చేసి, వాటికి ప్రచారం కల్పించకుండా అవగాహనా ఉద్యమాలను చేపట్టాలని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలకు సూచించింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని