close

తాజా వార్తలు

Updated : 28/11/2020 15:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మీ సమష్టి కృషికి అభినందనలు: మోదీ

జైడస్ సిబ్బందిని ఉద్దేశించి ప్రధాని ట్వీట్ 

 

అహ్మదాబాద్: అహ్మదాబాద్‌లోని జైడస్ క్యాడిలా బయోటెక్ పార్క్‌లో కొవిడ్-19 టీకా అభివృద్ధిని సమీక్షించిన ప్రధాని మోదీ..ఈ ప్రయోగంలో పాల్గొన్న సిబ్బంది సమష్టి కృషిని ప్రశంసించారు. ‘జైడస్ క్యాడిలా అభివృద్ధి చేస్తోన్న స్వదేశీ డీఎన్‌ఏ ఆధారిత టీకా గురించి సమగ్రంగా తెలుసుకునేందుకు అహ్మదాబాద్‌లోని జైడస్ బయోటెక్‌ పార్క్‌ను సందర్శించాను. ఈ ప్రయత్నం వెనక ఉన్న సిబ్బంది సమష్టి కృషిని నేను అభినందిస్తున్నాను. ఈ కీలక ప్రయాణంలో భారత ప్రభుత్వం వారితో చురుగ్గా పని చేస్తుంది’ అని మోదీ ట్వీట్ చేశారు. 

కరోనా టీకా అభివృద్ధిని సమీక్షించేందుకు మోదీ మొదట అహ్మదాబాద్‌లో పర్యటించారు. జైడస్ సంస్థ అభివృద్ధి చేసిన ‘జైకోవ్-డి’ టీకా ప్రయోగాల గురించి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. పీపీఈ కిట్ ధరించి ప్రయోగశాలను పరిశీలించారు. ప్రస్తుతం ఈ టీకా రెండో దశ ప్రయోగాలు జరుపుకొంటోంది. అహ్మదాబాద్‌ నుంచి మోదీ హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ను సందర్శించారు. అనంతరం పుణె బయల్దేరి వెళ్లనున్నారు.



Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని