పార్లమెంట్‌ భవనానికి మోదీ శంకుస్థాపన

తాజా వార్తలు

Updated : 10/12/2020 14:43 IST

పార్లమెంట్‌ భవనానికి మోదీ శంకుస్థాపన

దిల్లీ: ప్రజాస్వామ్య దేవాలయంగా పరిగణించే పార్లమెంట్‌ కొత్త భవనానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు శంకుస్థాపన చేశారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు సంసద్‌ మార్గ్‌లో వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ పునాదిరాయి వేసి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని తొలుత కేంద్రం భావించింది. అయితే, సెంట్రల్‌ విస్టా నిర్మాణంపై కేసు నడుస్తున్న నేపథ్యంలో శంకుస్థాపనకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. దీంతో ఈ కార్యక్రమాన్ని నిరాడంబరంగా చేపట్టారు. శంకుస్థాపనకు గుర్తుగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌, పీయూష్‌ గోయల్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా, విదేశీ రాయబారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త భవనం నిర్మాణ కాంట్రాక్ట్‌ను టాటా ప్రాజెక్ట్‌ లిమిటెడ్‌కు ఇచ్చిన విషయం తెలిసిందే. 

కొత్త భవనంలో అణువణువునా భారతీయత ప్రతిబింబించనుంది. లోక్‌సభ పైకప్పు పురివిప్పి ఆడుతున్న నెమలి ఆకృతిలో, రాజ్యసభ పైకప్పు విరబూసిన కమలం రూపంలో ఉండనున్నాయి. జాతీయ వృక్షమైన మర్రిచెట్టు పార్లమెంటులో అంతర్భాగంగా నిలువనుంది. 

ఇవీ చదవండి..

విశిష్టతల సమాహారం.. ప్రజాస్వామ్య సౌధం

మయూర సోయగం.. కమల వికాసం

సెంట్రల్‌ విస్టా నిర్మాణం దేశానికి గర్వకారణం



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని