సీఎంలతో ముగిసిన ప్రధాని వీడియోకాన్ఫరెన్స్‌
close

తాజా వార్తలు

Updated : 02/04/2020 16:52 IST

సీఎంలతో ముగిసిన ప్రధాని వీడియోకాన్ఫరెన్స్‌

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) వ్యాప్తి, లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ ముగిసింది. కొవిడ్‌-19 వ్యాప్తి నియంత్రణలో రాష్ట్రాలు ఒక్కటై కృషి చేయడం ప్రశంసనీయమని ప్రధాని అభినందించారు. లాక్‌డౌన్‌ నుంచి బయటపడిన వెంటనే ప్రజలంతా మూకుమ్మడిగా బయటకు వచ్చేందుకు అవకాశం ఉందని.. అలా జరిగితే మరోసారి వైరస్‌ వ్యాప్తి పెరిగే అవకాశాలు ఉంటాయని మోదీ చెప్పారు. ఆ విధంగా జరగకుండా ఉండేందుకు కేంద్రం, రాష్ట్రాలు సంయుక్తంగా పరిష్కార వ్యూహాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు.

మరోవైపు పలువురు ముఖ్యమంత్రులు మాట్లాడుతూ ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రధాని తన నాయకత్వ ప్రతిభ చూపారని కొనియాడారు. నిజాముద్దీన్‌ మర్కజ్‌ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తులను పసిగట్టడంతో పాటు కేసుల వ్యాప్తి పెరగకుండా తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రులు ప్రధానికి వివరించారు. కరోనా నియంత్రణ కోసం తీసుకునే చర్యల్లో ఎన్జీవోలు, సామాజిక నేతల సహకారం తీసుకోవాలని సీఎంలకు ప్రధాని సూచించారు. కొవిడ్‌-19 నియంత్రణలో సహకరిస్తున్న అందరికీ ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని