close

తాజా వార్తలు

Published : 10/08/2020 21:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వరద సహాయక చర్యల్లో కరోనాతో జాగ్రత్త:మోదీ

ఆరు రాష్ట్రాల సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ 

దిల్లీ: దేశ వ్యాప్తంగా ఓ వైపు కరోనా విజృంభిస్తుంటే.. భారీ వర్షాలు, వరదలు మరికొన్ని రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత రాష్ట్రాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. భారీ వర్షాలతో తీవ్ర ప్రభావానికి గురైన ఆరు రాష్ట్రాల సీఎంలతో సమీక్షించారు. కేరళ, కర్ణాటక, అసోం, బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్రలలో నెలకొన్న వరద పరిస్థితిపై ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అలాగే, నైరుతీ రుతుపవనాల సమయంలో ఏ రకంగా జాగ్రతలు తీసుకోవాలన్న అంశంపై  సమీక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ సహా పలు కేంద్ర బృందాలు చేపడుతున్న చర్యలను సీఎంలు అభినందించినట్టు సమాచారం. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. వరదలను అంచనా వేసేందుకు, వర్ష సూచన, హెచ్చరికల వ్యవస్థను మెరుగుపరేందుకు వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల మంచి సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. సహాయక చర్యల సమయంలో అన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖానికి మాస్క్‌లు ధరించడం, హ్యాండ్‌ శానిటైజర్ల వాడకంతో పాటు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని సూచించారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న దేశంలోని పలు రాష్ట్రాల్లో కురుస్తున్న ఈ భారీ వర్షాలకు లక్షలాది మంది ప్రజలు ప్రభావితమయ్యారు. ప్రాణ, ఆస్తి నష్టం కూడా సంభవించింది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.

కర్ణాటకలో భారీ వర్షాలు, వరదల కారణంగా రూ. 3500 కోట్లు నుంచి రూ.4వేల కోట్ల మేర నష్టం జరిగినట్టు ఆ రాష్ట్ర రెవెన్యూ మంత్రి తెలిపారు.  ఈ నేపథ్యంలో కర్ణాటక హోంమంత్రి బసవరాజ్‌ బొమ్మై కేంద్రం సాయం చేయాలని ప్రధానిని కోరారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు రూ.4వేల కోట్లు ఆర్థిక సాయం చేయాలన్నారు. బిహార్‌లో ఇప్పటివరకు 16 జిల్లాల్లో 74లక్షల మంది ఈ వరదల దాటికి ప్రభావితమయ్యారు. 23 మంది ప్రాణాలు కోల్పోయారు. మోదీతో జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు ఐదు రాష్ట్రాల నుంచి సీఎంలు పాల్గొనగా.. కర్ణాటక నుంచి మాత్రం హోంమంత్రి పాల్గొన్నారు. 

 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.