ప్రపంచానికే ఔషధాల్ని ఉత్పత్తి చేస్తున్నాం!

తాజా వార్తలు

Published : 09/10/2020 01:13 IST

ప్రపంచానికే ఔషధాల్ని ఉత్పత్తి చేస్తున్నాం!

దిల్లీ: భారత్‌, కెనడాల మధ్య సత్సంబంధాల్ని ఇరు దేశాల ప్రజాస్వామ్య విలువలే నడుపుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ మేరకు మోదీ గురువారం కెనడాలో నిర్వహించిన వార్షిక పెట్టుబడుల సమావేశంలో మాట్లాడారు. భారత్‌, కెనడాల మధ్య వాణిజ్య, పెట్టుబడుల సంబంధాల్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘భారత్‌, కెనడాల మధ్య ఉన్న ప్రజాస్వామ్య విలువలే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్ని నడిపిస్తున్నాయి. ప్రపంచానికి ఔషధాల్ని ఉత్పత్తి చేయడంలో భారత్‌ కీలక పాత్ర పోషిస్తోంది. దాదాపు 150 దేశాలకు మేం మందుల్ని సరఫరా చేస్తున్నాం. ఈ ఏడాది మార్చి నుంచి జూన్‌ వరకు దేశం మొత్తం లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు 23శాతం పెరిగాయి. దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) సరళీకృతం చేశాం. బాండు మార్కెట్‌ను అభివృద్ధి చేసేందుకు గణనీయంగా సంస్కరణలను చేపట్టాం’ అని వెల్లడించారు. 

అదేవిధంగా మోదీ మాట్లాడుతూ.. ‘కరోనా వైరస్‌ సంక్షోభాన్ని ఎదుర్కొన్న నేపథ్యంలో మేం పేదవారిని, చిన్న వ్యాపారస్థుల్ని ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాం. మేము చేపట్టిన ఈ సంస్కరణలు మరింత ఉత్పాదకతను పెంచుతాయి. కార్మిక రంగంలో పలు కీలక సంస్కరణలు కార్మికులు, యాజమాన్యం మధ్య మరింత స్నేహపూర్వక వాతావరణం ఏర్పడేలా చేశాం. ఈ మార్పు సులభతర వాణిజ్యానికి దోహదం చేస్తుంది. కరోనా సమయంలో చాలా దేశాలు సప్లై చైన్‌, పీపీఈ కిట్స్‌ కొరత వంటి సమస్యలు ఎదుర్కొన్నాయి. కానీ భారత్‌ అలాంటి సమస్యల్ని దరి చేరనీయలేదు. అలాంటి సమస్యలపై మేం పరిష్కారాన్ని చూపించాం’ అని అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని