‘టీకా అందజేతలో మొబైల్‌ సాంకేతికత’
close

తాజా వార్తలు

Updated : 08/12/2020 15:33 IST

‘టీకా అందజేతలో మొబైల్‌ సాంకేతికత’

ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ

దిల్లీ: కరోనా మహమ్మారిని అరికట్టే వ్యాక్సిన్‌ తొందరలో అందుబాటులోకి రానున్న వేళ దాన్ని ప్రజలకు పంపిణీ చేయడానికి మొబైల్‌ సాంకేతికతను భారీ ఎత్తున వినియోగించనున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మహమ్మారి సంక్షోభ సమయంలో కోట్లాది రూపాయల ప్రయోజనాలను ప్రజలకు అందించేందుకు ఈ సాంకేతికత దోహదం చేసిందని తెలిపారు. వర్చువల్‌గా నిర్వహించిన ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ సమావేశంలో మాట్లాడుతూ మంగళవారం ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద టీకా‌ కార్యక్రమం జరగబోతోందని.. దానిలో మొబైల్‌ సాంకేతికత విస్తృతంగా ఉపయోగించుకోబోతున్నామని తెలిపారు. 

5జీ సాంకేతికత వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రతిఒక్కరూ కలిసి పనిచేయాలని టెలికాం రంగాన్ని ఈ సందర్భంగా ప్రధాని మోదీ కోరారు. తద్వారా భవిష్యత్తు అవకాశాలను ఒడిసిపట్టేందుకు భారత యువతకు మార్గం సుగమం చేయాలన్నారు. అలాగే టెలికాం రంగం సహా మొబైల్‌ తయారీ, పరిశోధనకు భారత్‌ను కేంద్రంగా మార్చాలని హితవు పలికారు.

ఇదీ చదవండి..
2021 ద్వితీయార్థంలో రిలయన్స్‌ 5జీ సేవలు

కరోనా టీకా సామర్థ్యం కథేంటి?Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని