close

తాజా వార్తలు

Published : 28/11/2020 19:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మోదీజీ.. మీ రాక మాకు ప్రేరణ!

ప్రధాని రాక ప్రేరణనిచ్చిందన్న జైడస్‌ క్యాడిలా

దిల్లీ: జైడస్‌ బయోటెక్‌ పార్క్‌లో ప్రధాని నరేంద్రమోదీ పర్యటించడం ప్రేరణనిచ్చిందని ఆ సంస్థ తెలిపింది. వైద్యరంగ అవసరాలను తీర్చాలన్న తమ లక్ష్యానికి, ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు ఆయన రాక స్ఫూర్తినిచ్చిందని జైడస్‌ క్యాడిలా పేర్కొంది. జైడస్‌ కుటుంబంలోని 25,000 మంది ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’కు అంకితమయ్యారని వెల్లడించింది. కొవిడ్‌-19ను నిర్మూలించేందుకు సురక్షితం, సమర్థంగా పనిచేసే టీకాలు, వైద్య విధానాలు, గుర్తింపు ప్రక్రియలు కనిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపింది. ప్రస్తుతం ఆ సంస్థ రూపొందిస్తున్న జైకోవ్‌-డి టీకా రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉంది.

భారత్‌లో రూపొందుతున్న కరోనా వైరస్‌ టీకాల పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని నరేంద్రమోదీ శనివారం మూడు నగరాల్లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా మొదట అహ్మదాబాద్‌లోని జైడస్‌ బయోటెక్‌ పార్క్‌ను సందర్శించారు. టీకా అభివృద్ధి గురించి ఆరాతీశారు. సూదిమందు ప్రయోగాలపై శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. జైడస్‌ సంస్థ ప్రమోటర్లు, ఉన్నత ఉద్యోగులతో సమావేశం అయ్యారు. తనను చూసేందుకు తండోపతండాలుగా వచ్చిన ప్రజలకు ఆయన అభివాదం చేశారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ను సందర్శించారు. కొవాగ్జిన్‌ టీకా ప్రయోగాలు, తయారీ, సమర్థతకు సంబంధించిన అంశాలపై ఆరా తీశారు. వ్యాక్సిన్‌ కోసం కష్టపడుతున్న శాస్త్రవేత్తలను అభినందించారు.


Tags :

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని