పద్మ అవార్డుల దరఖాస్తు గడువు పెంపు

తాజా వార్తలు

Published : 29/08/2020 01:11 IST

పద్మ అవార్డుల దరఖాస్తు గడువు పెంపు

దిల్లీ: పద్మ అవార్డుల కోసం దరఖాస్తుల గడువును కేంద్రం పొడిగించింది. సెప్టెంబర్‌ 15 వరకు పెంచుతూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో 8035 దరఖాస్తులు రాగా.. వాటిలో 6361 దరఖాస్తుల పరిశీలన పూర్తి అయినట్లు హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి పద్మశ్రీ, పద్మ భూషణ్‌, పద్మ విభూషణ్‌ పురస్కారాలను ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. 1954 నుంచి వీటిని ఇస్తున్నారు. padmaawards.gov.in వెబ్‌సైట్‌ ద్వారా పద్మ అవార్డులకు మీరు కూడా నామినేషన్లు/ ప్రతిపాదనలు పంపొచ్చు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని