close

తాజా వార్తలు

పాక్‌ అదుపులో భారత జాలర్లు..!

గాంధీనగర్‌: గుజరాత్ ​తీరంలో 18 మంది భారతీయ మత్స్యకారులను పాకిస్థాన్​ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ (పీఎంఎస్‌ఏ) అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు ఫిషర్‌మెన్ అసోషియేషన్‌ గురువారం సాయంత్రం వెల్లడించింది. భారత్‌కు చెందిన మూడు బోట్‌లను కూడా సీజ్ చేసినట్లు తెలిపారు. జకావూ కోస్ట్​ దగ్గర అరేబియా సముద్రంలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద బుధవారం వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోర్‌బందర్‌కు చెందిన జాలర్ల సంఘం అధ్యక్షుడు  తెలిపారు. ఆగస్టు 15న చేపలు పట్టే కొత్త సీజన్ ప్రారంభమైన తర్వాత మత్స్యకారులను పట్టుకోవడం ఇదే తొలిసారన్నారు..


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.