గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ హోదాను మార్చిన పాక్‌!
close

తాజా వార్తలు

Published : 02/11/2020 00:53 IST

గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ హోదాను మార్చిన పాక్‌!

ప్రావిన్షియల్‌ హోదా కల్పిస్తున్నట్లు ఇమ్రాన్‌ఖాన్‌ ప్రకటన
పాక్‌ ప్రయత్నాలను తిరస్కరించిన భారత్‌

దిల్లీ: గిల్గిత్‌-బాల్టిస్థాన్‌కు తాత్కాలిక ప్రావిన్షియల్‌ హోదా కల్పిస్తున్నట్లు పాకిస్థాన్‌ అధికారికంగా ప్రకటించింది. గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ పర్యటనలో భాగంగా పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ ఈ ప్రటకన చేశారు. అయితే, దీన్ని భారత్‌ పూర్తిగా ఖండించింది. భారత భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించే ప్రయత్నమేనని పాకిస్థాన్‌ను హెచ్చరించింది. చట్టప్రకారం జమ్మూ కశ్మీర్‌, లద్దాఖ్‌తోపాటు గిల్గిత్‌-బాల్టిస్థాన్‌గా పిలిచే ప్రాంతం మొత్తం భారత్‌లో అంతర్భాగమేని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ పునరుద్ఘాటించారు. చట్టవిరుద్ధంగా, బలవంతంగా ఆక్రమించిన భూభాగాలపై ఎలాంటి అధికారం పాకిస్థాన్‌కు లేదని స్పష్టంచేశారు. ఏడు దశాబ్దాలుగా ఆప్రాంతంలో నివసిస్తున్న ప్రజల మానవహక్కుల ఉల్లంఘణ, దోపిడీ, స్వేచ్ఛను హరిస్తున్న పాకిస్థాన్,‌ ఇలాంటి దురాక్రమణ వల్ల ఆ నిజాలను దాచలేదని పేర్కొంది. భారత్‌ భూభాగాలపై ఇలాంటి దురాక్రమణలు ఆపేసి, వారి ఆక్రమణలో ఉన్న ప్రాంతాలన్నింటినీ వెంటనే ఖాళీచేయాలని పాకిస్థాన్‌కు స్పష్టంచేసింది.

వివాదాస్పద గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ను తమ దేశంలో లాంఛనంగా విలీనం చేసుకోవాలని పాకిస్థాన్‌ ఎన్నోరోజులుగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా గిల్గిత్‌-బాల్టిస్థాన్‌ (జి-బి) స్థాయిని మార్చాలని పాక్‌ ప్రభుత్వం ఈ మధ్యే నిర్ణయించింది. తాజాగా గిల్గిత్‌ పర్యటన ద్వారా ఇమ్రాన్‌ఖాన్‌ ప్రావిన్షియల్‌ హోదాపై అధికారిక ప్రకటన చేశారు. నిజానికి జి-బి ప్రాంతానికి స్వయంప్రతిపత్తి ఉంది. దీన్ని అలాగే ఉంచేందుకు, తన వాదనలకు చట్టబద్ధత కల్పించేందుకు పాక్‌ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ప్రావిన్షియల్‌ ఆర్డినెన్స్‌ల ద్వారా పాలిస్తోంది. తరచూ విధానపరమైన మార్పులను చేయడం ద్వారా జి-బి రాజ్యాంగ హోదాపై ఉద్దేశపూర్వకంగా అస్పష్టతను కలిగించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని