కరోనా ఫ్రీ సర్టిఫికేట్‌ తెస్తేనే భారత్‌కు ఎంట్రీ
close

తాజా వార్తలు

Published : 11/03/2020 10:49 IST

కరోనా ఫ్రీ సర్టిఫికేట్‌ తెస్తేనే భారత్‌కు ఎంట్రీ

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌(కొవిడ్‌-19) కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపు 60 మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడి కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే చైనా సహా ఇతర దేశాల పౌరులకిచ్చే అన్ని రకాల వీసాలపై పలు ఆంక్షలు తీసుకొచ్చింది. తాజాగా ఇటలీ, దక్షిణకొరియా నుంచి భారత్‌కు వచ్చే వారు కరోనా ఫ్రీ సర్టిఫికేట్‌ తీసుకురావాలని స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధనను మార్చి 10 నుంచి అమల్లోకి తీసుకొచ్చినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఓ అడ్వైజరీలో వెల్లడించింది. 

ఇటలీ, దక్షిణకొరియాల నుంచి వచ్చే భారత పర్యాటకులు, ఆ దేశ పౌరులు.. తమకు కొవిడ్‌-19 లేదని నిర్ధారించే ‘నెగటివ్‌’ధ్రువపత్రాన్ని తీసుకురావాల్సి ఉంటుందని ఆరోగ్యశాఖ సూచించింది. ఆ సర్టిఫికేట్‌ ఉన్న వారిని మాత్రమే దేశంలోకి అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఆ దేశాల్లో గుర్తింపు పొందిన ప్రయోగశాలల నుంచి ఈ సర్టిఫికేట్‌ తీసుకురావాలని తెలిపింది. ఇప్పటికే అమల్లో ఉన్న వీసా ఆంక్షలకు ఈ నిబంధనలు అదనం. అయితే ఈ నిబంధనలు తాత్కాలికమేనని, కరోనా ప్రభావం తగ్గిన తర్వాత నిబంధనలు సడలిస్తామని ఆరోగ్య శాఖ తమ అడ్వైజరీలో పేర్కొంది. 

ఆరోగ్య శాఖ నిబంధనల నేపథ్యంలో డీజీసీఏ అధికారులు కూడా విమానాశ్రయాల్లో తనిఖీలు చేపట్టారు. ఇటలీ, దక్షిణకొరియా నుంచి వస్తున్న ప్రయాణికులు తప్పనిసరిగా కరోనా నెగటివ్‌ సర్టిఫికేట్‌ చూపించాలని అధికారులు స్పష్టం చేశారు. 

ఇదీ చదవండి..

బ్రిటన్‌ ఆరోగ్యమంత్రికి కరోనా


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని