
తాజా వార్తలు
సుప్రీంకు చేరిన ‘రైతుల ఆందోళన’
దిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో అన్నదాతలు చేపట్టిన ఆందోళన వ్యవహారం సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది. రైతుల నిరసనతో కొవిడ్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున వారిని వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అంతేగాక, ఆందోళన కారణంగా అత్యవసర సేవలకు కూడా అంతరాయం కలుగుతోందని పిటిషనర్ పేర్కొన్నారు.
న్యాయవాది ఓం ప్రకాశ్ పరిహార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ‘దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన కారణంగా వేలాది మంది ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఒకవేళ కరోనా వైరస్ కమ్యూనిటీ వ్యాప్తి దశలోకి చేరుకుంటే గనుక దేశంలో భారీ వినాశనం సృష్టించే అవకాశం ఉంది’ అని ఓంప్రకాశ్ పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు సరిహద్దుల్లో అన్నదాతలు బైఠాయించడంతో ఆ మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయని, దీని వల్ల అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలుగుతోందని పిటిషనర్ అన్నారు. తక్షణమే వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించి సరిహద్దులను తెరిపించాలని కోరారు. అంతేగాక, ఆందోళనకారులు మాస్క్‌లు ధరించేలా, భౌతికదూరం పాటించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా హస్తిన సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళన తొమ్మిదో రోజుకు చేరింది. కొత్త చట్టాలపై రైతు సంఘాలు, కేంద్రం ఇప్పటికే రెండు విడతల్లో చర్చలు జరిపినప్పటికీ అవి కొలిక్కిరాలేదు. కొత్త చట్టాలపై ప్రభుత్వం ఇచ్చిన వివరణను రైతులు తిరస్కరించారు. చట్టాల్లో చాలా లొసుగులు ఉన్నాయన్న అన్నదాతలు వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో చర్చలు ఎటూ తేలకపోవడంతో శనివారానికి వాయిదా వేశారు.
ఇవీ చదవండి..
సరిహద్దుల్లో రైతులు.. దిల్లీలో ట్రాఫిక్ తిప్పలు
మరికొన్ని వారాల్లో భారత్‌లో టీకా: మోదీ
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- RRRపై సెటైర్.. స్పందించిన చిత్రబృందం
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!
- రివ్యూ: అల్లుడు అదుర్స్
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
- పంత్ తీరుపై అంపైర్లు కలగజేసుకోవాలి
- 75 డ్రోన్లు విరుచుకుపడి..!
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- 60 ఏళ్ల తర్వాత టీమ్ఇండియా 20 ఆటగాళ్లతో..
- వాయుసేన తలనొప్పికి తేజస్ మందు..!
- ఫిట్‌గా ఉన్నా.. గుండెపోటు వస్తుందా?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
