ప్రసాద్‌జీ.. మీ ఊహాగానాలేల?: ఒమర్‌

తాజా వార్తలు

Published : 25/10/2020 16:44 IST

ప్రసాద్‌జీ.. మీ ఊహాగానాలేల?: ఒమర్‌

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 పునరుద్ధరణ జరిగే పని కాదంటూ కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలపై నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ) ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా స్పందించారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఏం చెబుతారో చూడకుండా ఈ అంశంలో ముందస్తు ఊహాగానాలెందుకు అని ప్రశ్నించారు.

జమ్మూకశ్మీర్‌లో ప్రత్యేక జెండా ఎగురవేసేందుకు అనుమతిస్తేనే, జాతీయ జెండాను కూడా ఎగురవేస్తామని ముఫ్తీ పేర్కొనడంపై రవిశంకర్‌ స్పందిస్తూ శుక్రవారం పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అధికరణం 370 రద్దును యావద్దేశం అభినందించిందని, ఇకపై దాన్ని పునరుద్ధరించేది లేదని స్పష్టం చేశారు. దీనిపై ఒమర్‌ అబ్దుల్లా ఆదివారం ట్వీట్‌చేశారు. ‘‘ప్రసాద్‌జీ.. మీరేదీ పునరుద్ధరిస్తారని మేం అనుకోవడం లేదు. అయినా సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఏం చెబుతారో వినకుండా వారి స్వతంత్రతను పక్కన పెట్టి మీ మాటలే వింటారని మీరు అనుకోవద్దు’’ అంటూ ట్వీట్‌ చేశారు. ఆర్టికల్‌ 370పై అంశంపై సుప్రీం కోర్టు విచారణ జరుపుతోంది. జమ్మూకశ్మీర్‌కు చెందిన ఎన్‌సీ సహా పలు పార్టీలు దీనికి సంబంధించి పలు పిటిషన్లు దాఖలు చేశాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని