అర్ణబ్‌ను చట్టప్రకారమే అరెస్టు చేశారు: సంజయ్‌ రౌత్‌

తాజా వార్తలు

Updated : 04/11/2020 12:58 IST

అర్ణబ్‌ను చట్టప్రకారమే అరెస్టు చేశారు: సంజయ్‌ రౌత్‌

ముంబయి: రిపబ్లిక్‌ టీవీ చీఫ్‌ ఎడిటర్‌ అర్ణబ్ గోస్వామిని పోలీసులు చట్టప్రకారమే అరెస్టు చేశారని శివసేన నేత సంజయ్‌ రౌత్‌ అన్నారు. తప్పుచేసినట్లు ఆధారాలుంటే ఎవరినైనా అరెస్టు చేసే అధికారం పోలీసులకు ఉందన్నారు. నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ మృతి కేసు దర్యాప్తు, టీఆర్‌పీ రేటింగ్‌ స్కాం దర్యాప్తులో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించినందుకే అర్ణబ్‌ను అరెస్టు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. అర్ణబ్‌ అరెస్టును కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్ సైతం విమర్శించారు. ఈ ఘటన కాంగ్రెస్‌ ప్రభుత్వంలో వచ్చిన ఎమర్జెన్సీని తలపిస్తోందని మండిపడ్డారు. ఈ విమర్శలపై సంజయ్‌ రౌత్‌ స్పందించారు. ఠాక్రే ప్రభుత్వం ఏర్పాటైనప్పటినుంచి ఉద్దేశపూర్వకంగా ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వెల్లడించారు. పోలీసులు తమ పని తాము చేసుకుంటూ వెళ్తారని పేర్కొన్నారు.

ఓ ఇంటీరియర్‌ డిజైనర్‌ ఎండీ అన్వయ్‌ నాయక్‌, ఆయన తల్లి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారన్న కేసులో ముంబయి పోలీసులు అర్ణబ్‌ గోస్వామిని అరెస్టు చేశారు. తనకు చెల్లించాల్సిన రూ.5.40 కోట్లు ఇవ్వకుండా అర్ణబ్‌తోపాటు మరో ఇద్దరు తనను మోసం చేశారని ఇంటీరియర్‌ డిజైనర్‌ సూసైడ్‌ నోట్‌లో పేర్కొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో వెల్లడించాడు. 2018లో జరిగిన ఈ ఘటన కేసులోనే అర్ణబ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని