యూపీఎస్సీకి కొత్త ఛైర్మన్‌ నియామకం
close

తాజా వార్తలు

Published : 07/08/2020 23:41 IST

యూపీఎస్సీకి కొత్త ఛైర్మన్‌ నియామకం

దిల్లీ: యూపీఎస్సీ కొత్త ఛైర్మన్‌గా విద్యావేత్త, ఆచార్య ప్రదీప్‌ కుమార్‌ జోషీ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన యూపీఎస్సీలో సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న అరవింద్‌ కుమార్‌ సక్సేనా పదవీ కాలం నేటితో పూర్తికావడంతో కొత్త ఛైర్మన్‌గా జోషీని నియమించారు. గతంలో జోషి ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ల ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. అనంతరం 2015 మే నెలలో యూపీఎస్సీలో సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన 2021 మే 12వరకు కొనసాగనున్నారు. యూపీఎస్సీ ఏటా మూడు దశల్లో సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షను నిర్వహిస్తుంటుంది. ప్రిలిమినరీ, మెయిన్స్‌, ఇంటర్వ్యూలు నిర్వహించి అఖిలభారత సర్వీసులైన ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌‌‌ తదితర సర్వీసులకు అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని