close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120069643 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => B7vgmvqdmlM [video_short_link] => B7vgmvqdmlM [created_by] => [created_date] => [modified_by] => 8925086 [modified_date] => 2020-05-29 19:30:50.243056 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Updated : 29/05/2020 19:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రగులుతున్న మినియాపొలీస్‌

వాషింగ్టన్‌: ‘మినియాపోలీస్‌ ఘటన’ అమెరికాలో ఉద్రిక్తతలకు దారితీసింది. జాతివిద్వేషంతో ఇటువంటి ఘటనలు చోటు చేసుకొంటున్నాయని పలు చోట్ల ఆందోళనలు వెల్లువెత్తాయి. కొన్ని చోట్ల ఈ ఆందోళనలు అదుపు తప్పి హింసాత్మక ఘటనలకు దారితీశాయి. అమెరికా కాలమానం ప్రకారం రాత్రి 10.30 సమయంలో అక్కడి పోలీస్‌ స్టేషన్‌కు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఆందోళనకారులను అడ్డుకొనేందుకు వేసిన కంచెను దాటుకొని వచ్చి భవనంలోకి చొరబడి అక్కడి ఫర్నిచర్‌కు నిప్పంటించారు. అక్కడ పోలీసులు ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఫైర్‌ అలారం మోగుతున్నా ఎవరూ రాలేదని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

స్పందించిన ట్రంప్‌..
మినియాపోలీస్‌ ఘటనలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌  ట్రంప్‌ ట్విటర్‌లో స్పందించారు. ‘గొప్ప నగరమైన మినియాపోలీస్‌లో ఇటువంటి ఘటనలు జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోను. అక్కడ నాయకత్వ లోపం ఉంది. అక్కడి రాడికల్‌ లెఫ్ట్‌ మేయర్‌ జాకబ్‌ ఫ్రే పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలి. లేకపోతే నేషనల్‌సెక్యూరిటీ గార్డ్స్‌తో ఆ పని నేను చేయిస్తాను. ఆ గూండాలు జార్జ్‌ ఫ్లాయిడ్‌ జ్ఞాపకాలను అగౌరవపరుస్తున్నారు. నేను అది జరగనివ్వను. ఇప్పుడే గవర్నర్‌ టిమ్‌ వాల్జ్‌తో మాట్లాడాను. వారికి సాయంగా సైన్యం ఎప్పుడూ ఉంటుందని చెప్పాను. ఎంత కష్టమైనా పరిస్థితిని అదుపులోకి తెస్తామని భావిస్తున్నాను. దోపిడీలు ఎప్పుడైతే మొదలవుతాయో.. కాల్పులు అప్పుడు మొదలవుతాయి. థ్యాంక్యూ’’ అని ట్వీట్‌ చేశారు. 

కెంటకీలో ఆందోళనలు : ఈ ఆందోళనలు కెంటకీలో కూడా మొదలయ్యాయి. ఇక్కడ  సెకండ్‌ స్ట్రీట్‌ వద్ద డౌన్‌టౌన్‌లో భారీ సంఖ్యలో ఆందోళనకారులు గుమిగూడినట్లు అక్కడి పోలీసులు ట్వీట్‌ చేశారు. ఈ  ఆందోళకారుల మధ్యలో నుంచి తుపాకుల కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నట్లు పేర్కొన్నారు. 

మినియాపోలీస్‌కు నేషనల్‌ గార్డ్స్‌ 

ఆందోళనలతో అట్టుడుకుతున్న మినియాపోలీస్‌, సెయింట్‌ పౌల్‌  నగరాలకు మిన్నెసోటా నేషనల్‌ గార్డ్స్‌ బయల్దేరారు. దాదాపు 500 మంది గార్డ్స్‌ బల్దేరినట్లు ట్విటర్‌లో ప్రకటించారు. అక్కడి ప్రజల ఆస్తులు, ప్రాణాలను కాపడటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలు శాంతియుతంగా ఆందోళనలు నిర్వహించే హక్కును రక్షిస్తామని మిన్నెసోటా నేషనల్‌ గార్డ్స్‌ వెల్లడించింది. 

ఇదీ చదవండి

అమెరికాలో పోలీస్‌ కర్కశం



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.