
తాజా వార్తలు
శానిటైజర్ తయారీకి 600 సంస్థలకు అనుమతి
దిల్లీ: చేతులు శుభ్రం చేసుకునే ద్రావణాలకు (శానిటైజర్) కొరత రాకుండా చూసేందుకు కొత్తగా 600 సంస్థలకు తయారీ అనుమతులు ఇచ్చినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. శానిటైజర్ తయారుచేసే వారికి ఇథనాల్ అందడంలో ఎదురవుతున్న ఇబ్బందులన్నీ తొలగించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేసినట్లు తెలిపింది. కొత్తగా ఇది తయారుచేయడానికి ముందుకొచ్చే డిస్టిలరీలతోపాటు, ఇతరులకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలని సూచించింది. శానిటైజర్‌ను టోకుగా ఉత్పత్తి చేసేలా డిస్టిలరీలు, పంచదార కర్మాగారాలను ప్రోత్సహించాలని, ఇప్పటికే వీటి తయారీలో ఉన్న సంస్థలను మూడు షిఫ్టుల్లో పనిచేసి ఉత్పత్తిని పెంచేలా చూడాలని వినియోగదారుల వ్యవహారాలశాఖ ఆదేశించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ 200 ఎంఎల్ శానిటైజర్ ధర రూ.100కి మించడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
Tags :
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు