close

తాజా వార్తలు

ఆర్పీఎఫ్ జవాన్‌ తెగువ.. తప్పిన ప్రాణాపాయం

థానే: ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణికుడి ప్రాణాలను కాపాడాడు ఓ ఆర్పీఎఫ్ జవాను. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన మహారాష్ట్రలోని థానే రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. రైలు వస్తున్న విషయాన్ని గమనించక ఓ ప్రయాణికుడు పట్టాలపై నుంచి ఫ్లాట్‌ఫాం దాటే ప్రయత్నం చేస్తాడు. దీన్ని గుర్తించిన అక్కడే ఉన్న ఆర్పీఎఫ్‌ జవాను ప్రాణాలకు తెగించి పట్టాలపైకి దూకి ప్రయాణికుడిని ఫ్లాట్‌ఫామ్‌పైకి తోసివేశాడు. అక్కడి నుంచి మెరుపు వేగంతో జవాను మరోవైపునకు దూకడంతో ఇద్దరికీ ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన మొత్తం స్టేషన్‌లో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో  వైరల్ అయ్యింది. వీడియోని చూసిన నెటిజన్లు జవాను ధైర్యసాహసాలను అభినందిస్తూ, అనాలోచితంగా రైలు పట్టాలను దాటేందుకు ప్రయత్నించిన వ్యక్తిని శిక్షించాలని కామెంట్లు పెడుతున్నారు.

 

 



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.