close

తాజా వార్తలు

Published : 03/12/2020 13:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మోదీజీ..టీకాపై మీ వైఖరి ఏంటి?:రాహుల్

దిల్లీ: ప్రతి ఒక్కరికి టీకా వేయడం గురించి కేంద్రం ఎప్పుడూ మాట్లాడలేదంటూ ఆరోగ్యశాఖ కార్యదర్శి చేసిన ప్రకటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. టీకాకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ, ప్రభుత్వం, భాజపా నేతలను నుంచి విరుద్ధమైన ప్రకటనలు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. ‘ప్రధాని ప్రతి ఒక్కరికి లభిస్తుందన్నారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా.. ఆ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉచితంగా టీకా ఇస్తామని ప్రకటించారు. ఇప్పుడు, టీకా అందరికీ ఇస్తామని ఎన్నడూ చెప్పలేదని కేంద్ర ప్రభుత్వం అంటోంది. ఇంతకీ ప్రధాని వైఖరి ఏంటి?’ అని రాహుల్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. 

కాగా, ముందుగా వైరస్ గొలుసును విచ్ఛిన్నం చేస్తే, దేశంలోని మొత్తం జనాభాకు టీకాలు వేయాల్సిన అవసరం లేదని మంగళవారం కేంద్రం వెల్లడించింది. అలాగే దేశంలోని ప్రజలందరికీ టీకా వేస్తామని ఎన్నడూ చెప్పలేదని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ పేర్కొన్నారు. దేశంలో టీకా అభివృద్ధి, తయారీలో పాలుపంచుకుంటున్న మూడు ఫార్మా సంస్థలను ప్రధాని మోదీ సందర్శించిన అనంతరం భూషణ్ ప్రకటన వెలువడింది. 

అలాగే ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మేనిఫెస్టోను విడుదల చేస్తూ.. ఎన్డీఏ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా టీకా అందిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. ఆ ప్రకటనపై విపక్ష పార్టీలు మండిపడ్డాయి.



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన