మూడేళ్లలో 44 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు

తాజా వార్తలు

Published : 30/07/2020 03:03 IST

మూడేళ్లలో 44 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు

రైళ్ల సంఖ్య పెంపు దిశగా కేంద్రం అడుగులు

దిల్లీ: రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దేశీయ తొలి సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ సంఖ్య పెంపు దిశగా ఆ శాఖ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. రాబోయే మూడేళ్లలో అంటే 2022 నాటికి వీటి సంఖ్య 44కి పెంచనున్నట్లు రైల్వేశాఖ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు రైళ్లను చైన్నై, రాయ్‌బరేలి, కపుర్తలలో ఉన్న కోచ్‌ ఫ్యాక్టరీలతో వీటిని తయారు చేయనున్నట్లు వెల్లడించారు. మొదటి దశలో ప్రవేశపెట్టిన రెండు రైళ్లను చైన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో (ఐసీఎఫ్) తయారు చేసిన సంగతి తెలిసిందే. కొద్ది నెలల క్రితం ఈ రైళ్ల తయారీకి సంబంధించి కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే బోర్డు ఛైర్మన్‌ వీకే యాదవ్ తెలిపారు.

రాబోయే రెండు మూడేళ్లలో ఈ రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టనున్నట్లు తెలిపారు. ప్రొటోటైప్‌ రైళ్లను కమర్షియల్ సేవలకు అందుబాటులోకి తెచ్చేందుకు 28 నెలల సమయం పడుతుందని ఐసీఎఫ్ రైల్వే బోర్డుకు రాసిన లేఖలో పేర్కొంది. అలానే తయారీ ప్రారంభించేందుకు మరో ఆరు నెలల వ్యవధి పడుతుందని వెల్లడించింది. మొత్తం 44 రైళ్ల తయారీ 78 నెలల వ్యవధిలో పూర్తిచేయనున్నట్లు తెలిపారు.  ఈ రైళ్ల తయారీ 18 నెలల వ్యవధిలో పూర్తి కావడంపై అప్పట్లో కొంత వివాదం నెలకొంది. ఇటీవల వీటి తయారీకి సంబధించిన టెండర్లలో చైనా ప్రభుత్వానికి చెందిన సీఆర్‌ఆర్‌సీ సంస్థ గుర్‌గావ్‌కు చెందిన సంస్థతో కలిసి అంతర్జాతీయ సంస్థల జాబితాలో టెండర్‌ దాఖలు చేసింది. అయితే చైనా సంస్థలపై ఉన్న నిషేధం కారణంగా దానిని రద్దు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మొత్తం 44 రైళ్లకు సంబంధించి సుమారు రూ.1500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని