ముంబయిని ముంచెత్తుతున్న వర్షాలు
close

తాజా వార్తలు

Published : 05/07/2020 13:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ముంబయిని ముంచెత్తుతున్న వర్షాలు

ముంబయి: కరోనా మహమ్మారితో విలవిలాడుతున్న దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరానికి భారీ వర్షాల రూపంలో మరో విపత్తు ఏర్పడింది. థానేతో సహా మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతాల్లో వరుసగా మూడో రోజు వర్షాలు ముంచెత్తాయి. దీంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాల్లో  భారీగా వరద నీరు చేరింది. రాబోయే 24 గంటల్లో ముంబయి సహా చుట్టు పక్కల ప్రాంతాల్లో భారీగా వర్షపాతం చోటుచేసుకునే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ)అంచనా వేసింది.

గత రెండు రోజులుగా పడుతున్న వర్షాలతో సెంట్రల్ ముంబయిలోని హింద్‌మతా, తూర్పు శివారులోని చెంబూర్‌ ప్రాంతాలు జలమయమయ్యాయి. గడచిన 24 గంటల్లో దక్షిణ ముంబయిలోని కొలాబా అబ్జర్వేటరీలో 129.6 మి.మీ వర్షపాతం నమోదుకాగా, శాంతాక్రూజ్‌ ప్రాంతంలో 200.8 మి.మీ. వర్షపాతం నమోదయినట్లు ఐఎండీ వర్గాలు వెల్లడించాయి. థానే జిల్లా పరిసర ప్రాంతాలతో సహా కొంకణ్ ప్రాంతంలోని సింధ్‌దుర్గ్‌లో భారీ వర్షపాతం నమోదయినట్లు తెలిపారు.

విదర్భలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడినట్లు వాతావరణ వర్గాలు వెల్లడించాయి. వర్షపాతం కారణంగా శనివారం ముంబయిలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలానే పలు చోట్ల చెట్లు కూలిపోవడం, కొమ్మలు విరిగిపడిన ఘటనలు చోటుచేసుకున్నాయని బృహన్‌ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌ వర్గాలు తెలిపాయి. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని