ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన నళిని

తాజా వార్తలు

Updated : 21/07/2020 12:15 IST

ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన నళిని

వేలూరు: మాజీప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు అనుభవిస్తున్న నళిని తాజాగా ఆత్మహత్య చేసుకుంటానని జైలు అధికారులను బెదిరించారు. తమిళనాడు వేలూరు మహిళా జైలులో ఆమె శిక్ష అనుభవిస్తున్నారు. గత కొద్ది కాలంగా నళిని జైలు గదిలో ఉన్న తోటి ఖైదీతో మనస్పర్థలు ఏర్పడినట్లు సమాచారం. ఇందులో భాగంగానే సోమవారం రాత్రి తోటి ఖైదీతో మరోసారి గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో అక్కడకు చేరుకున్న జైలు అధికారులతో తాను ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించినట్లు సమాచారం.

రాజీవ్‌ గాంధీ హత్య కేసులో దోషిగా తేలిన నళిని గత 29సంవత్సరాలుగా శిక్ష అనుభవిస్తున్నారు. నళినితోపాటు ఆమె భర్త మురుగన్‌ కూడా పురుషుల జైల్లో ఉన్నాడు. గత కొంతకాలంగా బెయిల్‌ కోసం తీవ్రప్రయత్నం చేస్తున్న నళిని, ఈమధ్యే తన కుమార్తె వివాహం సందర్భంగా కొన్నిరోజులపాటు పెరోల్‌పై విడుదలై, తిరిగి జైలుకు వెళ్లారు. 

మాజీప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకు నళిని, ఆమె భర్త మురుగన్‌ ఎల్‌టీటీఈ ఉగ్రవాదులతో కలిసి వ్యూహ రచన చేశారు. ఈ కేసులో నళిని, మురుగన్‌ సహా ఏడుగురు దోషులుగా తేలారు. నళినికి తొలుత న్యాయస్థానం మరణశిక్ష విధించింది. అయితే ఆతర్వాత 2000 సంవత్సరంలో ఆ శిక్షను జీవితఖైదుగా మార్చారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని