close

తాజా వార్తలు

పౌరసత్వ బిల్లుపై జేడీయూలో అసంతృప్తి

న్యూదిల్లీ: పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభలో జనతాదళ్‌ యునైటెడ్‌ ఆమోదం తెలపడం పట్ల ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు ప్రశాంత్‌కిషోర్‌ అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ అధికార ప్రతినిధి పవన్‌ కే వర్మ తెలిపారు. ఈ విషయంపై పునరాలోచించాలని పార్టీ అధ్యక్షుడు నితిశ్‌కుమార్‌కు సూచించారు. రాజ్యాంగబద్ధం కాని, అనైక్యత విధానాలతో ఉన్న ఈ బిల్లుకు రాజ్యసభలో మద్దతు ఉపసంహరించుకోవాలని నితిశ్‌కుమార్‌ను కోరుతున్నట్లు వర్మ ట్వీట్‌ చేశారు. లోక్‌సభలో జేడీయూ ఎంపీలు 16, రాజ్యసభలో 6 మంది ఉన్నారు. వర్మ, కిషోర్‌ల పరస్పర విరుద్ధ వైఖరులతో పార్టీలో కొంత కలకలం రేగింది. పార్టీ విధానాలు, ఐక్యతా సిద్ధాంతాలు, గాంధేయ మార్గాలకు ఈ బిల్లు విరుద్ధమని కిషోర్‌ అన్నారు. గాంధేయ మార్గాలను ఆదర్శంగా తీసుకునే పార్టీ ఇందుకు భిన్నంగా పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం తెలపడం పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు జేడీయూ నేత ఒకరు ట్వీట్‌ చేశారు. పౌరసత్వ సవరణ బిల్లు ఐక్యతకు విరుద్ధం కాదని ఎంపీ రాజీవ్‌రంజన్ (లలన్‌ సింగ్‌) చెప్పడం విశేషం. బిల్లు ఆమోదం పట్ల జేడీయూ యూటర్న్‌ తీసుకుందని రాజకీయ ప్రతినిధులు, విద్యావేత్తలు విమర్శించారు. జేడీయూ ఇప్పటికే ట్రిపుల్‌ తలాక్‌, ఆర్టికల్‌ 370, సీఏబీపై నిర్ణయాన్ని మార్చుకుందన్నారు. భాజపా తీసుకున్న నిర్ణయాలను జేడీయూ మొదట వ్యతిరేకించినా ఓటింగ్‌ సమయానికి వాకౌట్‌ చేయడమో, మద్దతు తెలపడమో చేస్తుందన్నారు. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.