Reliance సాయం: 775 పడకలు ఉచితంగా..!

తాజా వార్తలు

Updated : 26/04/2021 20:39 IST

Reliance సాయం: 775 పడకలు ఉచితంగా..!

ముంబయి: కరోనాతో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటోన్న భారత్‌కు రిలయన్స్‌ ఫౌండేషన్‌ తన వంతు సహకారం అందిస్తోంది. ఈ వైరస్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడటంతో వైద్య సదుపాయాల కొరతతో అల్లాడుతున్న ముంబయి నగరానికి వైద్యసాయం అందించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు సర్‌ హెచ్‌ఎన్‌ రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆస్పత్రిలో 875 పడకలతో సేవలందిస్తామని రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ ప్రకటించారు. వీటిలో 775 పడకలు ఉచితమేనని తెలిపారు. అలాగే, గుజరాత్‌, మహారాష్ట్ర, దిల్లీ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, యూపీ, దమన్‌ దయ్యూ, దాద్రానగర్‌ హవేలీలకు రోజూ 700 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను ఉచితంగా అందిస్తున్నామన్నారు. దీన్ని మరింతగా విస్తరించనున్నట్టు ఆమె తెలిపారు.

దేశానికి సేవలందించడంలో రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఎప్పుడూ ముందు వరుసలోనే ఉందని నీతా తెలిపారు. కరోనాపై అవిశ్రాంత పోరాటం చేస్తున్న భారత్‌కు మద్దతు అందించడం తమ కర్తవ్యమన్నారు. తమ వైద్యులు, ఫ్రంట్‌లైన్‌ హెల్త్‌కేర్‌ సిబ్బంది నిరంతరం సేవలందిస్తున్నారని, అవసరమైన వారికి వైద్యం అందించడం ద్వారా విలువైన ప్రాణాలను కాపాడుతున్నారని తెలిపారు. ఈ కష్ట సమయంలో దేశానికి, ముంబయి నగర ప్రజలకు సేవ చేసేందుకు ఏదైనా చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నట్టు తెలిపారు. కరోనాను ఓడిద్దాం.. భారత్‌ను గెలిపిద్దాం అని నీతా అన్నారు. ముంబయిలోని ఎన్‌ఎస్‌సీఐ, సెవెన్‌ హిల్స్‌ ఆస్పత్రి, ట్రైడెంట్‌, బీకేసీలలో మొత్తంగా 875 పడకలతో ముంబయికి భారీ సహకారం అందిస్తున్న పెద్ద దాతృత్వ సంస్థగా నిలుస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని