కరోనాపై పోరులో మరణిస్తే ₹కోటి పరిహారం
close

తాజా వార్తలు

Updated : 01/04/2020 20:07 IST

కరోనాపై పోరులో మరణిస్తే ₹కోటి పరిహారం

దిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటంలో ఒకవేళ ఎవరైనా వైద్య సిబ్బంది ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు కోటి రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. కొవిడ్‌-19పై పోరులో వారి సేవలు సైనికుల కంటే తక్కువేమీ కాదని కొనియాడారు. ఈ మేరకు దిల్లీలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.

‘‘కరోనా బాధితులకు చికిత్స అందించే క్రమంలో వైద్యులు, నర్సులు, పారిశుధ్య సిబ్బంది ఎవరైనా మరణిస్తే వారి సేవలకు గుర్తింపుగా వారి కుటుంబాలకు కోటి రూపాయలు అందిస్తాం. వారు ప్రభుత్వ లేదా ప్రైవేటు రంగం అనే దాంతో సంబంధం లేకుండా ఈ మొత్తం అందదజేస్తాం’’ అని కేజ్రీవాల్‌ వెల్లడించారు. మరోవైపు దిల్లీలో మొత్తం 120 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ముగ్గురు వైద్యులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

కరోనా LIVE UPDATES కోసం క్లిక్‌ చేయండి..Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని