ఆ కార్మికుడి కుటుంబానికి రూ.కోటి సాయం

తాజా వార్తలు

Published : 22/08/2020 01:34 IST

ఆ కార్మికుడి కుటుంబానికి రూ.కోటి సాయం

చెక్కు అందజేసిన దిల్లీ సీఎం కేజ్రీవాల్‌

దిల్లీ: కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయిన పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబానికి దిల్లీ ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ మేరకు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ బాధిత కుటుంబాన్ని శుక్రవారం కలిశారు. ప్రభుత్వం తరఫున రూ.కోటి పరిహారం చెక్కును సాయంగా అందజేశారు. కరోనాతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వహించిన రాజు అనే పారిశుద్ధ్య కార్మికుడికి వైరస్‌ సంక్రమించడంతో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో సీఎం ‌ నార్త్‌ దిల్లీలోని మజ్ను కా తిల్లా ప్రాంతాన్ని సందర్శించి ఆ కుటుంబాన్ని పరామర్శించి పరిహారం చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. విపత్కర పరిస్థితుల్లో దిల్లీ ప్రజలకు సేవలందించడం ద్వారా వైరస్‌ సంక్రమించడంతో రాజు మృతి చెందాడన్నారు. కరోనా వారియర్ల సేవలు గర్వకారణమని తెలిపారు. కరోనాతో ఇప్పటివరకు దేశ రాజధాని నగరంలో దాదాపు 30 మంది పారిశుద్ధ్య కార్మికులు మృతిచెందారు. మరోవైపు, ప్రభుత్వం ప్రకటించిన పరిహారం కోసం బాధిత కుటుంబాలు దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు. 

దిల్లీలో ఇప్పటివరకు 1,57,354 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 1,41,824 మంది వైరస్‌ నుంచి కోలుకోగా.. 4,257 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 11,271 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దిల్లీలో రికవరీ రేటు 90శాతం ఉండగా.. మరణాల రేటు 2.7శాతంగా ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని