close

తాజా వార్తలు

బాలురతో ఆ విధంగా ప్రతిజ్ఞ చెయ్యించాలి

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలోని బాలురందరూ బాలికలతో అసభ్యకరంగా ప్రవర్తించబోమని ప్రతిజ్ఞ చేయించాలని నిర్ణయిం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తోటి విద్యార్థుల పట్ల మర్యాదకపూర్వంగా మెలిగే విధంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించాలని సీఎం సూచించారు. 

ఎఫ్‌ఐసీసీఐ మహిళా సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ  వ్యాఖ్యలు చేశారు. పాఠశాలల్లోని విద్యార్థులందరితో బాలికల పట్ల గౌరవప్రదంగా వ్యవహరిస్తామని ప్రతిజ్ఞ చేయించాలని దిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే మహిళ పట్ల ఎలా ప్రవర్తించాలనే విషయాన్ని తల్లి దండ్రులు తమ పిల్లలకు వివరించాలని సీఎం కేజ్రీవాల్‌ సూచించారు.  మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తే సహించేది లేదని తల్లులు, సోదరీమణులు పిల్లలను హెచ్చరించాలని ఆయన తెలిపారు. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.