తుపాన్లను మరింత ముందుగా కనిపెట్టొచ్చు
close

తాజా వార్తలు

Updated : 10/06/2021 14:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తుపాన్లను మరింత ముందుగా కనిపెట్టొచ్చు

సరికొత్త విధానాన్ని ఆవిష్కరించిన శాస్త్రవేత్తల బృందం

దిల్లీ: ఉష్ణ మండల తుపాన్లను ముందస్తుగా పసిగట్టేందుకు ఓ సరికొత్త విధానాన్ని శాస్త్రవేత్తల బృందం ఆవిష్కరించింది. తుపాను రావడానికి ముందు సముద్రాల్లో ఏర్పడే సుడిగుండాల ఆనవాళ్లను ఉపగ్రహ చిత్రాల కన్నా ముందుగానే కనిపెట్టడం, తుపాను ఏ ప్రాంతంలో, ఏ సమయంలో సంభవించనుందో గుర్తించడం ఈ విధాన ఉద్దేశం అని శాస్త్ర, సాంకేతిక విభాగం (డీఎస్‌టీ) తెలిపింది. ఇప్పటివరకూ రిమోట్‌ సెన్సింగ్‌ పద్ధతులే తుపాన్లను వీలైనంత ముందుగా పసిగడుతున్నాయి. అయితే సముద్ర ఉపరితలంపై అల్ప పీడనం అభివృద్ధి చెందాకే ఈ పద్ధతుల్లో తుపాన్ల సంభావ్యతను కనిపెట్టడానికి వీలవుతోంది. తుపానును పసిగట్టడానికి, దాని ప్రభావం మొదలయ్యే సమయానికి మధ్య ఎక్కువ వ్యవధి ఉంటే సన్నాహక చర్యలను పటిష్ఠంగా చేపట్టడానికి వీలవుతుంది. తుపాను పుట్టుకకు ముందు సుడిగుండాల లక్షణాలను క్షుణ్నంగా పరిశీలించి, వాటిని తుపాను సంభవించాక ఏర్పడిన పరిస్థితులతో పోల్చి చూడడం ద్వారా ఈ విధానాన్ని అభివృద్ధి చేశారు. ఈ నూతన విధానం ద్వారా తుపానుల పుట్టుకను కనీసం నాలుగు రోజుల ముందే అంచనా వేయొచ్చని వారు తెలిపారు.  Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని