మోదీ చెప్పిన ఉపాధి మంత్ర..!
close

తాజా వార్తలు

Published : 16/07/2020 03:48 IST

మోదీ చెప్పిన ఉపాధి మంత్ర..!

నైపుణ్యాలే కీలకమన్న ప్రధాని మోదీ
‘వరల్డ్‌ యూత్‌ స్కిల్స్‌ డే’ సందర్భంగా వీడియో ప్రసంగం

దిల్లీ: ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారితో దాదాపు అన్ని దేశాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి సంక్షోభ సమయంలో యవత ఉపాధిని మార్గాలను అన్వేషించుకోవడంతోపాటు ఉద్యోగ విపణిలో దీటుగా నిలబడేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు సూచనలు చేశారు. ‘స్కిల్‌, రీ-స్కిల్‌, అప్‌స్కిల్’‌ (నైపుణ్యం, నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం, నైపుణ్యాలను ఇతరులకు నేర్పించడం) ఎంతో కీలకమని, ఇదే యువతకు ఉపాధి మంత్రమని ప్రధానమంత్రి సూచించారు. ఉద్యోగ విపణిలో నిలదొక్కుకోవడానికి ఇవి ఎంతో ముఖ్యమని నరేంద్రమోదీ అన్నారు. ‘వరల్డ్‌ యూత్‌ స్కిల్‌ డే’ సందర్భంగా ప్రధాని మోదీ యువతకు వీడియో ద్వారా తన సందేశాన్నిచ్చారు.

నైపుణ్యం అనేది మనకు మనమే స్వయంగా అలవరచుకొని వృద్ధి చేసుకునేది. నైపుణ్యం అనేది స్వావలంబన కలిగించడమే కాకుండా మనతోపాటు తోటివారికి ఉపాధి కల్పిస్తుంది. ఇలాంటి సంక్షోభ సమయంలో నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం ఎంతో కీలకమని దేశయువతకు ప్రధాని మోదీ సూచించారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో పని విధానంతోపాటు ఉద్యోగ స్వభావం కూడా మారిపోయింది. దీనికితోడు సాంకేతిక పరిజ్ఞానంలోనూ ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ సందర్భంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యువత నూతన నైపుణ్యాలను పొందుతోందని ప్రధాని అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంలో వలస కార్మికులకూ తోడుగా నిలవాలని ప్రధాని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఉపాధి కల్పించే సంస్థలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోర్టల్‌ ద్వారా నైపుణ్యమున్న కార్మికులకు ఉపాధి కల్పించాలని సూచించారు. కరోనా కారణంగా తమ సొంత ప్రాంతాలకు వెళ్లిన కార్మికులకు ఇది ఎంతగానో తోడ్పడుతుందని ప్రధానమంత్రి అన్నారు. యువతను నైపుణ్యమున్న కార్మిక శక్తిగా మలిచేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ‘స్కిల్‌ ఇండియా మిషన్‌’ను ప్రారంభించిందని ప్రధాని గుర్తుచేశారు. దీనిద్వారా గత ఐదు సంవత్సరాలలో ఇప్పటివరకు దాదాపు ఐదు కోట్ల మంది యువత వివిధ రంగాల్లో తమ నైపుణ్యాలు మెరుగుపరుచుకున్నట్లు ప్రధాని వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని