ప్లీజ్‌..టీకాలు వేయించుకోండి!

తాజా వార్తలు

Published : 27/10/2020 01:00 IST

ప్లీజ్‌..టీకాలు వేయించుకోండి!

సియోల్‌: చలికాలం సమీపిస్తున్న తరుణంలో ప్రజలందరూ ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ కట్టడికి టీకాలు వేయించుకోవాలని దక్షిణకొరియా ప్రభుత్వం కోరింది. ప్రాధాన్యక్రమంలో చివరివరసలో ఉన్నవారికి కూడా ఉచితంగా ఫ్లూ టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన కొరియా.. ఇప్పటికే కరోనా వైరస్‌తో పోరాడుతున్న తరుణంలో ఈ వైరస్‌ కూడా విజృంభిస్తే తీవ్ర పరిస్థితులు ఎదురవుతాయనే ఉద్దేశంతో ఈ విన్నపం చేసింది. ఇదిలా ఉండగా, ఈ టీకా భద్రతపై అక్కడి ప్రజల్లో ఆందోళనలు నెలకొన్నాయి. ఈ టీకా కార్యక్రమం మొదలైన దగ్గరి నుంచి సుమారు 48 మంది మరణించడం వారి భయాలకు కారణం. అయితే టీకాలకు, మరణాలకు సంబంధం లేదని అక్కడి అధికారులు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ‘దుష్ప్రభావాలతో పోలిస్తే టీకావల్ల ప్రయోజనాలే ఎక్కువగా ఉంటాయని, ఈ అభిప్రాయంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ, నిపుణులు ఏకీభవిస్తున్నారని కొరియా ఆరోగ్య మంత్రి పార్క్‌ నీంగ్ హో వెల్లడించారు. మరోవైపు, గత నెలలో ప్రామాణిక ఉష్ణోగ్రతల వద్ద వాటిని నిల్వచేయకపోవడంతో 5మిలియన్ల డోసులను పారవేయాల్సిన పరిస్థితి తలెత్తడం గమనార్హం. గత సంవత్సరం కూడా ఫ్లూ టీకాలు వేయించుకున్న తర్వాత 1500 మంది మరణించగా, ఆ మరణాలకు టీకాలతో సంబంధం లేదని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.

కాగా, ఈ వ్యాధి కారణంగా ప్రతి ఏటా ఆ దేశంలో సుమారు మూడు వేల మరణాలు చోటుచేసుకుంటాయి. ఇదిలా ఉండగా..ఈ చలికాలం సమయంలో ‘ట్విన్‌డెమిక్‌’గా పిలిచే కరోనా వైరస్‌, ఫ్లూ వైరస్‌ల విజృంభణకు ఆస్కారం ఉండటంతో దక్షిణ కొరియా 20 శాతం అధికంగా ఫ్లూ టీకాల కోసం ఆదేశాలు జారీ చేసింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని