బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా ₹2వేలు ఫైన్‌

తాజా వార్తలు

Published : 21/11/2020 01:58 IST

బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా ₹2వేలు ఫైన్‌

దిల్లీ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ

దిల్లీ: దేశ రాజధాని నగరంలో కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈ మహమ్మారి వ్యాప్తికి కళ్లెం వేసేలా అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది.  మాస్క్‌ ధరించకుండా బయటకు వచ్చిన వారికి రూ.2వేలు చొప్పున జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకున్న కేజ్రీవాల్‌ సర్కార్‌.. తాజాగా మరిన్ని కఠిన చర్యలను ప్రకటించింది. కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించేలా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా, పొగాకు వాడినా, భౌతికదూరం పాటించకపోయినా రూ.2వేలు చొప్పున జరిమానా విధించనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్‌ జారీచేసింది.

ప్రజల్లో భయం పెంచడానికి వీలుగా గతంలో రూ.500లుగా ఉన్న జరిమానాను రూ.2వేలుకు కేజ్రీ సర్కార్‌ పెంచింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ ఆమోదం అనంతరం వైద్య ఆరోగ్యశాఖ ఈ నోటిఫికేషన్‌ను జారీచేసింది. మరోవైపు, దిల్లీలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఆగడంలేదు. శుక్రవారం తాజాగా మరో  118 కరోనా మరణాలు నమోదయ్యాయి. అలాగే, 6608 కేసులు వచ్చాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 5.17లక్షలకు చేరింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని