టీకా ప్రయోగాలు: కీలక నిర్ణయం తీసుకున్న స్పుత్నిక్‌!

తాజా వార్తలు

Published : 23/12/2020 23:56 IST

టీకా ప్రయోగాలు: కీలక నిర్ణయం తీసుకున్న స్పుత్నిక్‌!

మాస్కో: ప్రయోగ దశలో ఉన్న రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-విని తయారుచేస్తున్న సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మూడోదశ ప్రయోగాల్లో పాల్గొన్న తమ వాలంటీర్లకు ఇక నుంచి ప్లెసిబో వ్యాక్సిన్‌ ఇవ్వమని గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ ప్రకటించింది. ‘కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ప్లెసిబో ఇవ్వడం అంత మంచిది కాదు’ అని గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ అలెగ్జాండర్‌ గిన్స్‌బర్గ్‌ మీడియాతో వెల్లడించారు. ఇప్పటికే ప్లెసిబో తీసుకున్నవారిని గుర్తించి వారికి అసలైన వ్యాక్సిన్‌ ఇస్తామని తెలిపారు. అయితే, దీనికి నియంత్రణ సంస్థలు అనుమతి ఇచ్చాయా? లేదా అనే విషయంపై మాత్రం స్పష్టతలేదు.

స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ తుది దశ ప్రయోగాల్లో భాగంగా దాదాపు 40వేల వాలంటీర్లను గమలేయా నియమించుకుంది. అయితే, ప్రయోగాల్లో పాల్గొన్న వారందరికీ కరోనాను ఎదుర్కొనే అసలైన వ్యాక్సిన్‌ను ఇవ్వరు. కొందరికి మాత్రమే ప్రయోగ వ్యాక్సిన్‌ ఇచ్చి, మరికొందరికి ప్లెసిబో ఇంజెక్షన్‌ ఇస్తారు. అయితే, ఎవరికి ప్లెసిబో ఇచ్చారు, ఎవరికి వ్యాక్సిన్‌ ఇచ్చారనే విషయం మాత్రం ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్తపడతారు. అనంతరం వారు బాహ్యవాతావరణంలో తిరగడం వల్ల వారిలో ఎందరికి వైరస్‌ సోకిందనే అంశం ద్వారా వ్యాక్సిన్‌ సమర్థతను అంచనా వేస్తారు. అయితే, ప్లెసిబో తీసుకున్న వారిలో రోజులు గడుస్తున్నా ఇమ్యూనిటీ సామర్థ్యంలో మార్పులు లేవంటూ ప్రైవేటుగా ఇమ్యూనిటీ టెస్టు చేయించుకొన్న కొందరు వాలంటీర్లు వాదిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాల్లో పాల్గొంటున్న వాలంటీర్ల నుంచి ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువవుతున్నాయి. వీటి నేపథ్యంలోనే స్పుత్నిక్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిలాఉంటే, రష్యాలో అత్యవసర వినియోగం కింద స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌కు అక్కడి నియంత్రణ సంస్థ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు రెండు లక్షల మందికి రష్యాలో వ్యాక్సిన్‌ పంపిణీ చేశారు. ప్రయోగాల సమాచార విశ్లేషణలో వ్యాక్సిన్‌ 91.4శాతం సమర్థత చూపించిందని శాస్త్రవేత్తలు ప్రకటించారు.

ఇవీ చదవండి..
కొవిడ్‌ ఇమ్యూనిటీ: 8నెలల పాటు యాంటీబాడీలు
కరోనా అక్కడికీ దూరిపోయింది!


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని