
తాజా వార్తలు
ఇది పంజాబ్ 26/11
చండీగఢ్: కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన రైతుల పట్ల హరియాణా పోలీసులు వ్యవహరించిన తీరును శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ తీవ్రంగా ఖండించారు. 12ఏళ్ల క్రితం ఇదే రోజున ముంబయిలో జరిగిన దాడిని గుర్తు చేస్తూ.. రైతులపై పోలీసుల చర్యను ‘పంజాబ్ 26/11’గా అభివర్ణించారు.
‘చలో దిల్లీ’ పేరుతో ఆందోళన చేపట్టిన రైతులను హరియాణా సరిహద్దుల్లో పోలీసులు, భద్రతాసిబ్బంది అడ్డుకున్న విషయం తెలిసిందే. రైతులను చెదరగొట్టేందుకు సాయుధ బలగాలు బాష్పవాయువు, జల ఫిరంగులు ప్రయోగించాయి. ఈ ఘటనపై సుఖ్బీర్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘ఈ రోజు పంజాబ్ 26/11. ప్రజాస్వాయయుతంగా ఆందోళన చేసే హక్కును కూడా మనం కోల్పోతున్నామని ఈ ఘటన చూస్తే అర్థమవుతోంది. రైతుల శాంతియుత ఉద్యమాన్ని అణచివేసేందుకు హరియాణా, కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. జల ఫిరంగులతో, బాష్పవాయువులతో పంజాబ్ రైతుల హక్కులను కాలరాయకూడదు’ అని హరియాణా భాజపా ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
ఇదీ చదవండి..
అన్నం పెట్టే చేతులను ఆదుకోవాలే గానీ..
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- కల లాంటిది.. నిజమైనది
- ఆసీస్ మాజీలూ.. ఇప్పుడేమంటారు?
- మెగాస్టార్ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!
- మేం వస్తున్నాం.. టీమిండియా కాస్త జాగ్రత్త!
- గబ్బా హీరోస్.. సూపర్ మీమ్స్
- ఆ విశ్వాసంతోనే వెళ్లిపోతున్నా: ట్రంప్
- యువతిని హత్యచేసిన డిల్లీబాబు ఆత్మహత్య
- భలే పంత్ రోజు..
- ప్రపంచమంతా సెల్యూట్ చేస్తోంది: రవిశాస్త్రి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
