
తాజా వార్తలు
నిర్భయ దోషుల క్యురేటివ్ పిటిషన్లు కొట్టివేత
దిల్లీ: మరణశిక్ష అమలును సవాల్ చేస్తూ నిర్భయ దోషులు దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఉరిశిక్షపై స్టే విధించాలంటూ దోషులు వినయ్, ముఖేశ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఛాంబర్లో దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల ధర్మాసనం పిటిషన్లను ఏకగ్రీవంగా తోసిపుచ్చింది. పిటిషన్ల వాదనకు ఎలాంటి అర్హత లేదని స్పష్టం చేసింది. ఈనెల 22న ఉదయం 7 గంటలకు దోషులకు ఉరిశిక్ష అమలుచేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. తాజా తీర్పుతో దోషుల ముందున్న చిట్టచివరి న్యాయపరమైన అవకాశం కూడా ముగిసింది.
కోర్టు తీర్పు పట్ల నిర్భయ తల్లి సంతోషం వ్యక్తం చేశారు. ఏడేళ్ల తన న్యాయపోరాటం ఫలించిందన్నారు. కానీ, దోషుల్ని ఉరితీయనున్న రోజే తనకు అత్యంత సంతోషకరమైన దినమని ఆమె వ్యాఖ్యానించారు.
ఏడేళ్ల క్రితం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులుగా తేలిన వినయ్ శర్మ, ముఖేశ్ సింగ్, అక్షయ్ కుమార్ సింగ్, పవన్ గుప్తాలను ఈ నెల 22న ఉదయం 7 గంటలకు ఉరితీయాలని ఆదేశిస్తూ దిల్లీ కోర్టు ఇటీవల డెత్ వారెంట్ జారీ చేసింది. ఆలోగా దోషులు తమ న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకోవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో దోషులు ఇద్దరు వినయ్ శర్మ, ముఖేశ్ సింగ్ గతవారం తమకున్న చిట్టచివరి న్యాయపరమైన అవకాశమైన క్యురేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- ముక్క కొరకలేరు!
- ఒక్క వికెట్ తీస్తేనేం..సిరాజ్ సూపర్: సచిన్
- నేను తెలుగింటి అల్లుడినే: సోనూసూద్
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- బైడెన్ తొలి సంతకం వీటిపైనే..!
- శెభాష్ నట్టూ..కసి కనిపిస్తోంది: రోహిత్
- ‘సలార్’ ప్రారంభోత్సవ వీడియో చూశారా..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
