T cell: బ్లడ్‌ క్యాన్సర్‌ రోగులకు ‘టి’ కణ రక్షణ!  
close

తాజా వార్తలు

Published : 31/05/2021 11:00 IST

T cell: బ్లడ్‌ క్యాన్సర్‌ రోగులకు ‘టి’ కణ రక్షణ!  

ఫిలడెల్ఫియా: కొవిడ్‌ను ఎదుర్కోవడానికి యాంటీబాడీలే కీలకం కాదని, రోగనిరోధక వ్యవస్థలోని ‘టి’ కణాలు కూడా ముఖ్యమేనని అమెరికా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. బ్లడ్‌ క్యాన్సర్‌ రోగుల్లో సదరు వ్యాధికి తీసుకుంటున్న చికిత్స కారణంగా యాంటీబాడీలు తక్కువగా ఉంటాయని, అయినా కొవిడ్‌పై పోరాడటంలో సీడీ8 టి కణాలు వీరికి అక్కరకొస్తాయని తేల్చారు. ఈ కణాలు అధిక స్థాయిలో కలిగిన క్యాన్సర్‌ బాధితులు కొవిడ్‌ నుంచి కోలుకోవడానికి మూడున్నర రెట్లు ఎక్కువ అవకాశం ఉంటుందన్నారు. 
కొవిడ్‌ బారినపడిన క్యాన్సర్‌ రోగులకు చికిత్సను మెరుగుపరచడంలో ఇది చాలా కీలకమని తెలిపారు. రోగ నిరోధక వ్యవస్థలోని ఒక విభాగం కుదేలైనప్పుడు మిగతా విభాగాలను గరిష్ఠ స్థాయిలో ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. ప్రస్తుతం కొవిడ్‌ నుంచి రక్షణ కోసం ఇస్తున్న ఎంఆర్‌ఎన్‌ఏ టీకాల వల్ల రోగనిరోధక వ్యవస్థలో యాంటీబాడీలు, టి కణాల పరంగా స్పందన ఉత్పన్నమవుతుందని వివరించారు. అందువల్ల క్యాన్సర్‌ బాధితులకు వ్యాక్సిన్లు ఇచ్చినప్పుడు.. యాంటీబాడీలు ఉత్పత్తి కాకపోయినప్పటికీ ‘టి’ కణ రోగనిరోధక వ్యవస్థ ద్వారా రక్షణ లభించవచ్చని వెల్లడైందన్నారు. ఇతరత్రా క్యాన్సర్లు ఉన్న వారితో పోలిస్తే బ్లడ్‌ క్యాన్సర్‌ బాధితులు కొవిడ్‌తో మరణించే ప్రమాదం ఎక్కువని కూడా వెల్లడైందన్నారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని