కరోనా వేళ.. జల్లికట్టుకు అనుమతి

తాజా వార్తలు

Updated : 23/12/2020 14:47 IST

కరోనా వేళ.. జల్లికట్టుకు అనుమతి

కరోనా నెగిటివ్ ఉన్న 300 మంది మాత్రమే పాల్గొనేలా ఉత్తర్వులు

చెన్నై: కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం జల్లికట్టు క్రీడకు బుధవారం అనుమతినిచ్చింది. మకర సంక్రాంతి సందర్భంగా నిర్వహించే ఈ పోటీల్లో 300 మంది మాత్రమే పాల్గొనేలా పరిమితిని విధించింది. మామూలుగా అయితే వేల సంఖ్యలో యువకులు ఈ పోటీలో పాల్గొని ఎద్దులను అదుపు చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే, కొవిడ్ కారణంగా పరిమితులతో కూడిన అనుమతులు ఇస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

‘జల్లికట్టు, మంజువిరట్టు(ఎద్దులతో పాల్గొనే మరోరకమైన క్రీడ)లో 300 మంది, ఎరుతువారట్టులో 150 మంది మాత్రమే పాల్గొనేలా అనుమతించాం. అలాగే ఈ పోటీలన్నీ బహిరంగ మైదానాల్లోనే నిర్వహించాలి. మొత్తం మైదానం సామర్థ్యంలో 50 శాతం మంది మాత్రమే హాజరవ్వాలి’ అని ఆ ప్రకటనలో ప్రభుత్వం వెల్లడించింది. అలాగే వాటిని వీక్షించడానికి వచ్చే ప్రజలకు థర్మల్ స్కానర్‌తో తనిఖీలు చేయాలని తెలిపింది. అందరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించేలా చూడాలని నిర్వాహకులను ఆదేశించింది. ఈ పోటీల్లో పాల్గొనే వారు తప్పకుండా కరోనా నిర్ధరాణ పరీక్ష చేయించుకోవాలని పేర్కొంది. నెగిటివ్ అని తేలిన వారికే అనుమతి ఉంటుందని తేల్చిచెప్పింది. 

తమిళనాడులోని మధురై సమీపంలో అలంగానల్లూరులో జరిగే జల్లికట్టు పోటీలు ప్రపంచ స్థాయి గుర్తింపు ఉంది. వీటికి వీక్షించడానికి వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తుంటారు. అవనియాపురం, పాలమేడులో కూడా ఈ పోటీలు జరుగుతాయి. ఇదిలా ఉండగా..ఒకప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణించిన నెల తరవాత జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలంటూ మెరీనా బీచ్‌లో 2017 జనవరి 8 నుంచి 23 వరకు భారీ స్థాయిలో నిరసనలు జరిగాయి. ఈ నిరసనల్లో భాగంగా కాల్పులు, హింస కూడా చోటుచేసుకుంది. నాటి ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్‌ సెల్వం దిల్లీకి వెళ్లి, కేంద్రాన్ని ఒప్పించి మరీ అనుమతి ఉత్తర్వులు పొందారు.

ఇవీ చదవండి:

2020లో ప్రపంచాన్ని కుదిపేసిన ఘటనలు..!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని