ఒకే ఒక్క కరోనా కేసు వచ్చిందని..
close

తాజా వార్తలు

Published : 24/12/2020 20:33 IST

ఒకే ఒక్క కరోనా కేసు వచ్చిందని..

తైపీ: దేశీయంగా ఒక్క కరోనా వైరస్ కేసు వెలుగుచూసినందుకు తైవాన్ ప్రభుత్వం అగ్గిమీద గుగ్గిలం అయింది. నిబంధనలు ఉల్లంఘించిన పైలట్ వల్లే ఈ వైరస్ వ్యాపించిందని తెలుసుకున్న ప్రభుత్వం.. సదరు   విమానయాన సంస్థపై 1 మిలియన్ న్యూ తైవాన్ డాలర్ల జరిమానాను విధించింది. మన భారత కరెన్సీలో ఆ మొత్తం 25లక్షల రూపాయల పైమాటే. 

కరోనా వైరస్ పుట్టిల్లుగా భావిస్తోన్న చైనా పక్కనే ఉండే చిన్న దేశం తైవాన్. వైరస్ తీవ్రతను గుర్తించి ముందుగానే మేల్కొన్న ఆ దేశం కట్టుదిట్టమైన నిబంధనలు అమలు చేయడంతో 2.38 కోట్ల జనాభాలో 700 పైచిలుకు కేసులు మాత్రమే వెలుగుచూశాయి. ఏప్రిల్ 12 తరవాత దేశీయంగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కానీ, మంగళవారం అక్కడి ప్రభుత్వం అందరిని ఆశ్చర్యపర్చే ప్రకటన చేసింది. దేశంలోని ఒక మహిళకు కరోనా వైరస్ సోకిందని వెల్లడించింది. న్యూజిలాండ్‌కు చెందిన పైలట్‌ ఆమె స్నేహితుడని, అతడి వల్లే ఆమెకు వైరస్ సోకిందని అధికారులు గుర్తించారు. అలాగే ఆ వ్యక్తి ఎవరెవరిని కలిసిందీ చెప్పలేదని, కాక్‌పిట్‌లో మాస్క్‌ పెట్టుకోలేదని ప్రభుత్వం చెప్పడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఈ క్రమంలో మహమ్మారి నియంత్రణ నిబంధనలను ఈవా ఎయిర్‌ విమానయాన సంస్థ సరిగా అమలు చేయలేదని గ్రహించిన ప్రభుత్వం.. దానిపై ఒక మిలియన్ తైవాన్ డాలర్ల జరిమానాను విధించింది. కాగా, ఈ ఘటనపై ఆ సంస్థ ఇప్పటికే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పింది. అంతేకాకుండా వైరస్ వ్యాప్తికి కారణమైన ఆ పైలట్ చర్యను తీవ్రంగా పరిగణించి..ఉద్యోగం నుంచి తొలగించింది. ఇదిలా ఉండగా, వరల్డో మీటర్ గణాంకాల ప్రకారం..తైవాన్‌లో ఇప్పటివరకు 776 మందికి వైరస్ సోకగా..కేవలం ఏడు మరణాలు సంభవించడం గమనార్హం. 

ఇవీ చదవండి:

కరోనా: ఆ దేశ ప్రధానిపై రూ.900కోట్ల దావా

బెంగళూరు నగరంలో 144 సెక్షన్‌!

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని