Coronavirus: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ తగ్గుముఖం

తాజా వార్తలు

Published : 23/09/2021 13:10 IST

Coronavirus: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ తగ్గుముఖం

గత వారం 36 లక్షల కేసులు: డబ్ల్యూహెచ్‌ఓ

జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఊరటనిచ్చే కబురు చెప్పింది. గత వారం మొత్తం 36 లక్షల కేసులు నమోదైనట్లు తెలిపింది. అంతకుముందు వారంతో పోలిస్తే దాదాపు 4 లక్షల కేసులు తగ్గినట్లు వెల్లడించింది. ప్రధానంగా పశ్చిమ ఆసియాలో 22%, ఆగ్నేయాసియాలో 16% మేర కేసుల తగ్గుదల నమోదైనట్లు చెప్పింది.

మరణాలు 7% తగ్గుదల..

ప్రపంచవ్యాప్తంగా గత వారం 7% మేర కొవిడ్‌ మరణాలు తగ్గినట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది. ఈమేరకు 60 వేలకు దిగువన కొవిడ్‌ మరణాలు సంభవించినట్లు పేర్కొంది. ఆగ్నేయాసియాలో 30% శాతం కొవిడ్‌ మరణాలు తగ్గగా.. పశ్చిమ పసిఫిక్‌ ప్రాంతంలో 7% పెరిగాయి. అమెరికా, భారత్, బ్రిటన్, టర్కీ, ఫిలిప్పీన్స్‌ల్లో అత్యధిక సంఖ్యలో కేసులు బయటపడ్డాయి. సాంక్రమిక శక్తి ఎక్కువగా కరోనా వైరస్‌ డెల్టా రకం ప్రపంచంలోని ప్రతిచోట ఉందని.. 185 దేశాల్లో ఈ వేరియంట్‌ బయటపడినట్లు డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని