Cricket: ప్లంబర్‌కు రూ.కోటి.. ‘డ్రీమ్‌ 11’తో వరించిన అదృష్టం

తాజా వార్తలు

Updated : 14/10/2021 06:55 IST

Cricket: ప్లంబర్‌కు రూ.కోటి.. ‘డ్రీమ్‌ 11’తో వరించిన అదృష్టం

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌.. ఓ ప్లంబర్‌ జీవితాన్నే మార్చేసింది. రాత్రికి రాత్రే అతడు కోటీశ్వరుడయ్యాడు. అంతా క్రికెట్‌ బెట్టింగ్‌ యాప్‌ డ్రీమ్‌ 11 మాయ. అక్టోబరు 10న.. చెన్నై సూపర్‌ కింగ్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ మధ్య జరిగిన క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌పై బెట్‌ వేయగా.. అదృష్టం తలుపుతట్టింది. ఏకంగా.. రూ.కోటి సొంతమైంది. అతడే బిహార్‌లోని కటిహార్‌ జిల్లా మనిహారీకి చెందిన బబ్లూ మండల్‌. బబ్లూ.. హంస్‌వర్‌ గ్రామంలో ప్లంబింగ్‌ పనులు చేసేవాడు. ఈ క్రమంలోనే తనతో పనిచేసే మరో వ్యక్తి ద్వారా డ్రీమ్‌ 11 గురించి తెలుసుకున్నాడు. కొద్దిరోజుల్లోనే అదృష్టం వరించింది.   ఈ డబ్బుతో ఇల్లు కట్టుకుంటానని, కొంత మొత్తాన్ని ఓ దేవాలయానికి విరాళంగా ఇస్తానని బబ్లూ చెప్పాడు. ‘‘నాతో పని చేసే వ్యక్తి డ్రీమ్‌ 11 గురించి చెప్పాడు. నాకు అప్పటి వరకు అసలేం తెలియదు. నా ఫోన్‌లో ఆ వ్యక్తే యాప్‌ ఇన్‌స్టాల్‌ చేశాడు. కొద్దిరోజుల క్రితమే నేను అది వాడడం మొదలుపెట్టా. మొదట రూ.200 పెట్టాను. ఇప్పుడు ఏకంగా రూ.కోటి గెలుచుకున్నాను. రూ. 30 లక్షలు పన్ను రూపంలో కట్‌ చేశారు. 70 లక్షలు నాకు వచ్చాయి’’ అని బబ్లూ మండల్‌ చెప్పాడు.


Advertisement

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని