
తాజా వార్తలు
ఉగ్రదాడిలో 36 మంది పౌరులు మృతి
వాగడూగు(బుర్కినా ఫసో): పశ్చిమాఫ్రికా దేశం బుర్కినాఫాసోలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. మంగళవారం జరిపిన దాడుల్లో దాదాపు 36 మంది మరణించినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. నగ్రావోగో ప్రాంతంలోని ఓ మార్కెట్‌పై దాడి జరిపి... తగలబెట్టడం ద్వారా ముష్కరులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. అనంతరం పక్కనే ఉన్న గ్రామంలోకి వెళ్లి మరో నలుగురిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మొత్తం 36 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ దాడుల్లో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రభుత్వం ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. ముష్కరమూకల ఏరివేత కోసం జరుగుతన్న పోరులో ప్రజలు సహకరించాలని అభ్యర్థించింది. అర్హులైన యువకులకు ఆయుధాలు ఇచ్చి వారిని ఈ పోరులో భాగం చేసేందుకు సంబంధించిన ఓ బిల్లుకు అక్కడి పార్లమెంటు మంగళవారం ఆమోదం తెలిపింది.
గత నెల బుర్కినాఫాసోలో జరిగిన మరో దాడిలో కనీసం 35మంది పౌరులు మరణించిన విషయం తెలిసిందే. గత నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ ఇస్లామిక్ ఉగ్రవాదులు పంజా విసురుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఫ్రాన్స్ సైన్యం.. ఉగ్రవాద ముఠాలు స్వాధీనం చేసుకున్న అనేక ప్రాంతాల్ని తిరిగి సొంతం చేసుకునేందుకు అక్కడి ప్రభుత్వానికి సహకరిస్తోంది. ఈ క్రమంలో బుర్కినాఫాసో సైన్యానికి ఇటు ఫ్రాన్స్, అటు అమెరికా శిక్షణ ఇస్తున్నాయి.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- అలా చేస్తే భారత్‌దే విజయం: గావస్కర్
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- ఓవైపు కవ్వింపులు.. మరోవైపు అరుపులు
- మహా నిర్లక్ష్యం
- అఫ్గాన్ కార్లకు ‘39’ నంబర్ ఉండబోదు.. ఎందుకంటే?
- నాన్‌స్టాప్ ‘ఫన్’షూట్.. లంగాఓణి ‘ఉప్పెన’ రాణి
- గబ్బాలో కొత్త హీరోలు
- ఆ వార్తల్లో నిజం లేదు.. మోహన్‌బాబు టీమ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
