ఇది ప్రధాని మోదీ విజయం: చిరాగ్‌

తాజా వార్తలు

Published : 11/11/2020 12:48 IST

ఇది ప్రధాని మోదీ విజయం: చిరాగ్‌

దిల్లీ: బిహార్‌లో ఎన్డీయే విజయాన్ని ప్రధాని మోదీ విజయంగా అభివర్ణించారు లోక్‌ జన్‌శక్తి పార్టీ (ఎల్‌జేపీ) అధ్యక్షుడు చిరాగ్‌ పాసవాన్‌. భాజపాపై ఓటర్లు విశ్వాసంతో ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో తమ పార్టీ బాగా పోరాడిందని, పార్టీకి ఓట్ల శాతం పెరిగిందన్నారు. ‘బిహార్‌ ప్రజలు ప్రధాని మోదీపై నమ్మకముంచారు. ప్రజలు భాజపావైపే మొగ్గుచూపుతున్నట్లు తాజా ఫలితాల ద్వారా స్పష్టమైంది. ఇది ప్రధాని నరేంద్రమోదీ గెలుపు’ అని ట్వీట్ చేశారు. అయితే చిరాగ్‌ నేతృత్వం వహిస్తున్న ఎల్‌జేపీ ఒకేఒక్కస్థానంలో మాత్రమే విజయం సాధించింది.

బిహార్‌ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగింది. ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్డీయే కూటమి 125 స్థానాలు కైవసం చేసుకొని విజయ బావుటా ఎగురవేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 122 మార్కును దాటింది. మహా కూటమి 110 స్థానాలకే పరిమితమైంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని