ఊహూ.. అమెరికా పోనంటూ కోర్టుకెక్కిన వృద్ధుడు!
close

తాజా వార్తలు

Updated : 12/07/2020 11:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఊహూ.. అమెరికా పోనంటూ కోర్టుకెక్కిన వృద్ధుడు!

కొవిడ్‌-19ని భారత్‌ కట్టడి చేసిందన్న యూఎస్‌ వృద్ధుడు

అమెరికా.. భూతల స్వర్గం! అవకాశం దొరకాలే గానీ ఇప్పటికీ అక్కడ స్థిరపడాలీ అనుకొనే వారి సంఖ్య ఎక్కువే. హెచ్‌-1బి సహా చాలా రకాల వీసాలను తాత్కాలికంగా నిలిపివేయడంతో ఎంతమంది విలపించారో అందరికీ తెలిసిందే.

అయితే 74 ఏళ్ల ఆ వృద్ధుడు మాత్రం తిరిగి తన దేశమైన అమెరికాకు వెళ్లనంటున్నారు. భారత్‌లోనే ఉంటానంటున్నారు. కొవిడ్‌-19ని కట్టడి చేయడంలో అగ్రరాజ్యం విఫలమైందని భారత్‌ విజయవంతమైందని భావిస్తున్నారు. తన పర్యాటక వీసాలను బిజినెస్‌ వీసాగా మార్చాలని కేరళ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఇంతకీ ఆయన పేరేంటంటే జానీ పాల్‌ పీర్స్‌.

పర్యాటక వీసాపై పీర్స్‌ భారత్‌కు వచ్చారు. ఐదు నెలలుగా కోచిలో ఉంటున్నారు. ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో అమెరికా విఫలమైందని ఆయన అంటున్నారు. భారత్‌ మాత్రం అద్భుతంగా నియంత్రించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం తన దేశం వెళ్లేందుకు అయిష్టంగా ఉన్న ఆయన తన వీసాను బిజినెస్‌ వీసాగా మార్చాలని కేరళ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అలా మారిస్తే మరో 180 రోజులు ఇక్కడే ఉండొచ్చన్నమాట.

కేరళలోనే మరికొంత కాలం ఉండి పర్యాటక సంస్థను ప్రారంభించాలని పీర్స్‌ భావిస్తున్నారు. ‘భారత్‌లో వైరస్‌ నియంత్రణ తీరు నన్ను ఆకట్టుకుంది. అమెరికాలోని ప్రజలు కొవిడ్‌-19ను లెక్కచేయడం లేదు. అందుకే నా కుటుంబం సైతం ఇక్కడి వస్తే బాగుండనిపిస్తోంది’ అని ఆయన అన్నారు. ప్రస్తుతం భారత్‌లో ఎనిమిది లక్షలకు పైగా కొవిడ్‌-19 కేసులు ఉండగా అమెరికాలో 30లక్షలు దాటేశాయి. మరణాల సంఖ్య సైతం 1,33,000 దాటేసింది.

-ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని