close

తాజా వార్తలు

Published : 29/11/2020 23:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎంపీలో తగ్గిన పులుల మరణాల రేటు..

భోపాల్‌: దేశంలో మధ్యప్రదేశ్‌  పులుల రాష్ట్రంగా పేరొందింది. ఈ సంవత్సరం 26 చారల పులులు చనిపోయాయని జాతీయ పులుల సంరక్షణ కేంద్రం తెలిపింది. దీనిపై మధ్యప్రదేశ్‌ అటవీ శాఖ మంత్రి విజయ్‌ షా స్పందిస్తూ గత ఆరు సంవత్సరాల్లో ఎంపీలో పులుల జననాల రేటు కన్నా మరణాల రేటు తగ్గిందన్నారు. 2020 ఏప్రిల్‌ నాటికి 26 పులులు చనిపోయినట్లు ఎన్‌టీసీఏ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ‘బాంధవ్‌గర్‌ టైగర్‌ రిజర్వ్‌లో 10 పులులతో కలిపి 21 పులులు సంరక్షణ కేంద్రంలోనే చనిపోయాయి.  గత సంవత్సరం అనారోగ్యంతో 28 పులులు చనిపోయినట్లు చెప్పారు.   ప్రస్తుతం ఎంపీలో 124 పులి పిల్లలు ఉన్నాయి. గత రెండు సంవత్సరాలుగా వీటిని లెక్కలోకి తీసుకోవడం లేదు. తదుపరి లెక్కింపులో వీటిని లెక్కించనున్నాం’అని షా చెప్పారు.  దేశంలో పులులు ఎక్కువగా ఉన్న రాష్ట్ర్రంలో ఎంపీ తర్వాత స్థానంలో కర్ణాటక ఉంది.  కర్ణాటకలో 2020 సంవత్సరంలో 10 పులులు చనిపోయినట్లు తెలిపారు. బాంధవ్‌ఘర్‌ టైగర్‌ రిజర్వ్‌లో ప్రస్తుతం 125 పులులు ఉన్నాయి. ఎంపీలో పులుల సంరక్షణ కోసం ప్రత్యేక బలగాలు తగ్గాయి.  దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు  రాష్ట్ర వన్యప్రాణి కార్యకర్త అజయ్‌ దుబే వివరించారు.
 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన