
తాజా వార్తలు
టిక్‌టాక్‌కు రూ.45వేల కోట్ల నష్టం..!
చైనా యాప్‌లకు పెద్ద దెబ్బే
ముంబయి: యాప్‌లను నిషేధిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చైనా విలవిల్లాడుతోంది. మింగలేక కక్కలేక బాధపడుతోంది. డబ్లూటీసీ నియమాలకు విరుద్ధమని డొల్ల మాటలు చెబుతోంది. అయితే, యాప్‌ల నిషేధంతో డ్రాగన్ కంపెనీలపై దెబ్బ బాగానే పడిందని తెలిసింది.
నిషేధం వల్ల టిక్‌టాక్, హెలో యాప్‌ల మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ ఏకంగా రూ.45వేల కోట్లు (6 బిలియన్ డాలర్లు) నష్టపోనుందని చైనా అధికార మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఒక్క మేలోనే ప్రపంచ వ్యాప్తంగా 112 మిలియన్ల సార్లు టిక్‌టాక్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారన్న మొబైల్ యాప్ విశ్లేషణ సంస్థ సెన్సార్ ట్వోర్ నివేదికను ఉటంకించింది. వీరిలో ఎక్కువమంది భారతీయులే ఉన్నారని అమెరికాకు రెట్టింపు సంఖ్యలో డౌన్లోడ్లు చేసుకున్నారని వెల్లడించింది.
భారత్ నిషేధించిన 59 యాప్‌లు మొత్తంగా రూ.70-80వేల కోట్ల వరకు నష్టపోయే అవకాశముందని తెలుస్తోంది. తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో గత నెల భారత, చైనా సైనికులు ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. రెట్టింపు సంఖ్యలో చైనీయులు హతమయ్యారని సమాచారం.
ఈ నేపథ్యంలో దేశాల మధ్య ఉద్రికత్తలు పెరిగాయి. చైనా ఇప్పటికీ ద్వంద్వ విధానాలే అవలంభిస్తుండటంతో మోదీ ప్రభుత్వం చర్చలు జరుపుతూనే సరిహద్దుల్లో సైన్యం, వాయు, నౌకా దళాలను అప్రమత్తం చేసింది. డ్రాగన్‌ను ఉక్కిరి బిక్కిరి చేసేందుకు యాప్‌లను నిషేధించింది. చైనీయులు పెట్టుబడులు, సంస్థలను అడ్డుకుంటోంది.