బిహార్‌ సీఎంపై ప్రశాంత్‌ విసుర్లు

తాజా వార్తలు

Published : 18/11/2020 00:44 IST

బిహార్‌ సీఎంపై ప్రశాంత్‌ విసుర్లు

పట్నా: బిహార్‌ నూతన సీఎంగా మరోసారి ప్రమాణస్వీకారం చేసిన జేడీయూ నేత నీతీశ్‌కుమార్‌కు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అభినందనలు తెలియజేశారు. అభినందనలు తెలియజేస్తూనే.. బిహార్‌ ప్రజలు మరికొన్ని సంవత్సరాలు సీఎంగా అలసిపోయిన నాయకుడి పాలనకు సిద్ధంగా ఉండాలంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘బిహార్‌ సీఎంగా మరోసారి పదవీ బాధ్యతలు చేపట్టిన నీతీశ్‌కుమార్‌కు అభినందనలు. ముఖ్యమంత్రిగా అలసిపోయిన నాయకుడి నేతృత్వంలో.. బిహార్‌ ప్రజలు  మరికొన్ని సంవత్సరాలు పేలవమైన పాలనకు సిద్ధంగా ఉండాలి’ అంటూ ప్రశాంత్‌ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. 

గతంలో 2015 బిహార్‌ ఎన్నికల్లో నీతీశ్‌ కుమార్‌ విజయానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ కీలక పాత్ర పోషించారు. జేడీయూ ఆ సమయంలో ఆర్జేడీ, కాంగ్రెస్‌తో కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత జేడీయూలో చేరిన కొద్దికాలానికే కిశోర్‌ ఆ పార్టీకి, నీతీశ్‌కు వ్యతిరేకంగా మారారు. అనంతరం ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చి నీతీశ్‌పై ఘాటు విమర్శలు చేశారు. ఈ ఏడాది కరోనా వైరస్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌ సమయంలో వలస కూలీలపై ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. దేశ నలుమూలల నుంచి వచ్చిన కార్మికుల్ని కనీస కొవిడ్‌ నిబంధనలు పాటించకుండా ఒకే గదిలో నిర్బంధించారని ఆరోపించారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ నీతీశ్‌ను సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని