చైనా 5జీ పరికరాల నిషేధం దిశగా కేంద్రం!
close

తాజా వార్తలు

Published : 01/07/2020 01:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చైనా 5జీ పరికరాల నిషేధం దిశగా కేంద్రం!

ముంబయి: చైనా దురాక్రమణ, దుందుడుకు తనాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే టిక్‌టాక్‌ సహా 59 చైనా యాప్‌లను నిషేధించిన కేంద్రం చైనీస్‌ 5జీ పరికాలను సైతం నిషేధించేందుకు సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. సోమవారం జరిగిన సమావేశంలో అగ్రశ్రేణి మంత్రుల బృందం ఈ అంశంపై మాట్లాడారని తెలిసింది.

వినియోగదారుల వ్యక్తిగత సమాచారం, గోప్యతకు భంగం కలుగుతోందని, సమాచారం చైనీస్‌ సర్వర్లలోకి చేరుతోందని సోమవారం రాత్రి 59 చైనా యాప్‌లపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఇందులో టిక్‌టాక్‌, హలో, షేర్‌ఇట్‌ వంటి యాప్‌లు ఉన్నాయి. చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు 5జీ పరికరాలపై నిషేధం విధించే అంశంపై మంత్రులు చర్చించారని అభిజ్ఞ వర్గాలు తెలిపాయి.

వాస్తవంగా ఇప్పటికే 5జీ స్పెక్ట్రమ్‌ వేలం జరగాలి. కరోనా వైరస్‌ కారణంగా ఇప్పుడది కనీసం ఏడాది వరకు వాయిదా పడింది. వొడాఫోన్‌, ఐడియా వంటి టెలికాం సంస్థల ఆర్థిక పరిస్థితి  అంతంత మాత్రంగానే ఉండటమూ ఇందుకు దోహదం చేసింది. అయితే 5జీ వ్యవహారంలో హువావే కీలకం కానుందని తెలిసింది.

అమెరికా ఇప్పటికే హువావేపై నిషేధం విధించింది. ఆ సంస్థ అధినేతకు చైనా కమ్యూనిస్టు పార్టీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. హువావేపై మరికొన్ని ఆరోపణలు రావడంతో డొనాల్డ్‌ ట్రంప్‌ దానిని నిషేధిస్తూ కఠిన నిర్ణయం తీసుకున్నారు. బ్రిటన్‌, భారత్‌ సైతం ఇలాంటి చర్యలే తీసుకోవాలని అమెరికా కోరింది. కాగా 4జీకి సంబంధించి చైనా పరికరాలు వాడొద్దని బీసీసీఐకి ఇంతకు ముందే కేంద్రం ఆదేశాలిచ్చింది. 5జీ పరికరాలను నిషేధిస్తే ప్రైవేటు ఆపరేటర్లపై ప్రభావం పడే అవకాశం ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని