అదంతా పై నుంచే వస్తుంది: ట్రంప్‌
close

తాజా వార్తలు

Published : 21/05/2020 12:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అదంతా పై నుంచే వస్తుంది: ట్రంప్‌

దోచుకోవడానికే బిడెన్‌ గెలవాలని చైనా ప్రయత్నం

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ సృష్టిస్తోన్న సంక్షోభానికి చైనాయే కారణమంటూ తన విమర్శలకు మరింత పదును పెట్టారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌. ఆ వైరస్‌ సృష్టించిన మారణహోమం, ఇబ్బందుల నుంచి ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించాలని బీజింగ్ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. 

‘చైనా ప్రతినిధి చాలా తెలివితక్కువగా తన దేశాన్ని సమర్థించుకుంటున్నారు. ప్రపంచ మొత్తం అల్లకల్లోలం సృష్టించి, మారణహోమానికి కారణమవుతున్న వైరస్‌ గురించి తప్పుడు సమాచారంతో తప్పుదోవ పట్టిస్తున్నారు. యూఎస్‌, ఐరోపా దేశాలపై చైనా చేస్తున్న తప్పుడు ప్రచారం అవమానకరంగా ఉంది. అదంతా పై నుంచే వస్తోంది. వారు వైరస్‌ వ్యాప్తిని సులభంగా ఆపివేయవచ్చు. కానీ వారు అలా చేయలేదు!’ అని ట్రంప్‌ ట్విటర్ వేదికగా చైనా మీద మండిపడ్డారు. 

అంతేకాకుండా నవంబరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తనకు పోటీగా ఉన్న జో బిడెన్‌ను దీనిలోకి లాగి, ట్రంప్‌ రాజకీయ ప్రచారమూ కానిచ్చారు. ‘జో బిడెన్ గెలవాలనే ఉద్దేశంతో చైనా ఈ తప్పుడు సమాచార వ్యాప్తి చేస్తోందన్నారు. నేను వచ్చే వరకు కొనసాగిన దోపిడిని మళ్లీ కొనసాగించడానికి  ఆ దేశం బిడెన్‌ గెలవాలని కోరుకుంటోంది’ అని మరో ట్వీట్ చేశారు.  కరోనా వైరస్‌ గురించి చైనా సరైనా సమాచారాన్ని ప్రపంచానికి వెల్లడించలేదని ట్రంప్ ఆ దేశంపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దాంతో రెండు దేశాల మధ్య సంబంధాలు ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నాయి.  

ఇవీ చదవండి:

నేపాల్ వాదనకు చారిత్రక ఆధారాల్లేవ్!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని